టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని అఖిల్ ఆమధ్య నటించిన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది, అయితే ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, ప్రముఖ సినీ నిర్మాత అనీల్ సుంకర నిర్మించారు. దాదాపుగా రూ.85 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించగా కనీసం రూ.10 కోట్లు కూడా కలెక్ట్ చెయ్యలేకపోయింది. దీంతో దర్శకనిర్మాతలకి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అప్పటినుంచి అఖిల్ తన నెక్స్ట్ సినిమా కథల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.
టాలీవుడ్ సినీవర్గాల సమాచారం ప్రకారం అఖిల్ తెలుగు డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని అనంతపురం జిల్లాకి చెందిన ఓ మారుమూల పల్లెటూరులో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ స్టోరీ విన్న అఖిల్ హీరోగా నటించేందుకు సుముఖంగా ఉండటంతోపాటూ ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించేందుకు సన్నాహాలు జరుగతున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ALSO READ : ప్రభాస్ - హను రాఘవపూడి మూవీ కోసం క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్
ఈ విషయం ఇలా ఉండగా గతంలో డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి ప్రముఖ హీరో కిరణ్ అబ్బవరంతో "వినరో భాగ్యము విష్ణు కథ" అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. దీంతో మురళీ కిషోర్ తన నెక్స్ట్ సినిమాకి పవర్ఫుల్ కథని సిద్దం చేసుకుంటున్నాడు.