Prabhas marriage: ప్రభాస్ కి కాబోయే భార్య తెలుగమ్మాయేనా.? మరి ఆ హీరోయిన్..?

Prabhas marriage: టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ కి 45 ఏళ్ళు ఉన్నప్పటికి ఇంకా పెళ్లి చేసుకుండా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో ప్రభాస్ ఫ్యామిలీతోపాటూ ఫ్యాన్స్ కూడా డార్లింగ్ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

అయితే ఎన్నిసార్లు పెళ్లి గురించి అడిగినా ప్రభాస్ మాత్రం కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను కానీ ఎప్పుడనేది మాత్రం చెప్పలేను అంటూ గతంలో సందర్భాల్లో తెలిపాడు. అలాగే ఆమధ్య కల్కి 2898AD మూవీ ఈవెంట్ లో కూడా ప్రభాస్ పెళ్లి ప్రస్తావన రావడంతో "నా లేడీ ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీయకూడదనుకుంటున్నానని, అందుకే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకొకొను అంటూ టాపిక్ ని డైవర్ట్ చేసాడు.

ఇటీవలే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రభాస్ పెళ్లిపై హింట్ ఇచ్చాడు. అయితే రామ్ చరణ్ టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న "అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే" షోలో పాల్గొన్నాడు. ఇందులోభాగంగా ప్రభాస్ పెళ్లి ఈ ఏడాది ఉంటుందని అలాగే ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వెస్ట్ గోదావరి జిల్లా గణపవరం పట్టణానికి చెందిన యువతి అని అన్ స్టాపబుల్ లో రామ్ చరణ్ చెప్పినట్లు సమాచారం. దీంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రభాస్ పెళ్లి మ్యాటర్ తెగ వైరల్ అవుతోంది.

Also Read :-  ఓటీటీల్లో లేటెస్ట్ సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు

అయితే గతంలో ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తో లవ్ లో పడ్డాడని అంతేగాకుండా ముంబైలో డేటింగ్ కూడా  చేస్తున్నారని పలు వార్తలు బలంగా వినిపించాయి. కానీ ఈ విషయంపై కృతి సనన్ స్పందిస్తూ తాను ప్రభాస్ తో ప్రేమలో ఉన్నట్లు వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. అలాగే తాను ప్రభాస్ తో కలసి నటించినంత మాత్రాన ఇలా ప్రేమ పుకార్లు పుట్టించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.