
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ మధ్య బాలీవుడ్ నుంచి కూడా శ్రీలీల ఆఫర్లు క్యూ కడుతున్నట్లు సమాచారం. అయితే నటి శ్రీలీల బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో పడిందని, అంతేకాదు డేటింగ్ కూడా చేస్తున్నారని పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికితోడు ఈమధ్య శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ కలసి ఒకే ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తూ కనిపించడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. కానీ ఈ వార్తలపై ఇప్పటివరకూ నటి శ్రీలీల లేదా కార్తీక్ ఆర్యన్ స్పందించలేదు..
ఈ విషయం ఇలా ఉండగా ఈ రూమర్స్ పై కొందరు టాలీవుడ్ ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఇద్దరు సెలెబ్రెటీలు కలసి ఒకే ఫంక్షన్ లో డ్యాన్స్ చేసినంత మాత్రాన వారిమధ్య ఏదో ఉందంటూ ప్రచారాలు చెయ్యడం సరికాదని అంటున్నారు. అలాగే శ్రీలీల ప్రేమ, పెళ్లిపై బాలయ్య చేసిన కామెంట్లు కూడా గుర్తు చేస్తున్నారు. గతంలో బాలకృష్ణ శ్రీలీల తనకి కూతురు వంటిదని మంచి వరుడిని వెతికి ఆమె పెళ్లి తన చేతుల మీదుగా చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ శ్రీలీల విషయంలో లేనిపోని రూమర్స్ క్రియేట్ చెయ్యద్దంటూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ | సమంతతో ఆ రూమర్స్ పై స్పందించిన లేడీ డైరెక్టర్..
అయితే నటి శ్రీలీల ప్రస్తుతం తెలుగులో రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మార్చ్ 28న రిలీజ్ కానుంది. అలాగే ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న మాస్ జాతర తదితర సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.