బాలీవుడ్ కి బన్నీ.. రామ్ చరణ్ కి సాధ్యం కానిది అల్లు అర్జున్ వల్ల అవుతుందా..?

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది చివరిలో వచ్చిన పుష్ప 2: ది రూల్ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. దాదాపుగా 4 ఏళ్ళు కష్టపడినందుకు బన్నీకి సాలిడ్ హిట్ దక్కిందని చెప్పవచ్చు. అయితే పుష్ప 2 సినిమా కి సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయి. అంతేకాదు పుష్ప 2 తో అల్లు అర్జున్ కి బాలీవుడ్ లో  మంచి ఫ్యాన్ బేస్ తో పాటూ ఫుల్ క్రేజ్ వచ్చింది. దీంతో ఇదే అదునుగా భావించి హిందీలో స్ట్రైట్ సినిమా చెయ్యడానికి అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

అయితే గురువారం (జనవరి 09) అల్లు అర్జున్ ముంబైలోని జుహులో ఉన్న ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ ఆఫీస్ కి వెళ్లి వస్తుండగా విలేఖర్ల కంటపడ్డాడు. కానీ మీడియాతో మాట్లాడేందుకు బన్నీ ఆసక్తి చూపించలేదు. దీంతో అల్లు అర్జున్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ కి బాలీవుడ్ లో దేవదాస్, గుజారిష్, బాజీరావ్ మస్తానీ, పద్మావతి, రామ్ లీల, ఇలా ఎన్నో మంచి హిట్స్ ఉన్నాయి. దీంతో బన్నీ తన హిందీ డెబ్యూ సినిమాకి ఈ డైరెక్టర్ ని ఎంచుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దర్శకుడు సంజయ్  లవ్ & వార్ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. 

ALSO READ | Rashmika Mandanna: రష్మికకు గాయం.. దెబ్బ ఎలా తగిలిందంటే..?

ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత బన్నీ సినిమా సినిమా స్క్రిప్ట్ పనులు స్టార్ట్ అవుతాయని బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. అయితే గతంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జంజీర్ (తెలుగులో తుఫాన్) అనే సినిమా చేశాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో రామ్ చరణ్ మళ్లీ హిందీ సినిమాల జోలికి వెళ్ళలేదు. మరి అల్లు అర్జున్ బాలీవుడ్ లో ఏ విధంగా రాణిస్తాడో చూడాలి.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక తెలుగులో ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా జూన్ నుంచి పట్టాలెక్కనుంది.