ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా? ఆట ప్రారంభం కాకముందే స్క్రీన్‌పై CSK పేరు!

ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా? ఆట ప్రారంభం కాకముందే స్క్రీన్‌పై CSK పేరు!

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముందే ఫిక్స్ అయినట్లు కథనాలు వస్తున్నాయి. అందుకు నరేంద్ర మోడీ స్టేడియంలో చోటుచేసుకున్న టెక్నికల్ తప్పిదమే కారణం. ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో అంపైర్లు టాస్ ఆలస్యమవుతున్నట్లుగా ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రదర్శించాల్సిన స్టేడియంలోని బిగ్ స్క్రీన్స్ పై రన్నరప్ 'చెన్నై సూపర్ కింగ్స్' అని పడింది. ఇంకేముంది ఆట ప్రారంభం కాకముందే స్క్రీన్స్ పై చెన్నై అని పడడంతో ఫైనల్‌లో గుజరాత్ గెలవబోతోందని అభిమానులు అనుమానిస్తున్నారు.

ఈ సీజన్ లో చాలా మ్యాచులు ఊహకందని పలితాలతో అటు వీక్షకులను.. ఇటు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి. కేకేఆర్  ఆటగాడు రింకూ సింగ్.. ఒకే ఓవర్ లో 5 సిక్సులు బాధి విజయాన్ని అందించటం, హైదరాబాద్ జట్టు ఆఖరి బంతికి 6 పరుగులు చేయాల్సిన సమయంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ నోబాల్ వేయటం, ఆర్సీబీ వర్సెస్ లక్నో మ్యాచులో హర్షల్ పటేల్ మన్కడింగ్ చేయకుండా తప్పించటం.. ఇలా బోలెడు సంఘటనలు జరిగాయి. వీటికి తోడు అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలు.. అభిమానులకు మరింత అనుమానాలు పెంచాయి. 

ఇలాంటి పరిస్థితులలో ఆఖరి మ్యాచ్ అయినా.. సజావుగా సాగుతుందా? అంటే అదీ లేదు. మ్యాచ్ ఇంకా మొదలు కాకముందే రన్నరప్ చెన్నైగా ప్రకటించడమంటే ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ గెలవబోతుందని ముందుగానే రాసి పెట్టారా? అని అభిమానులు అనుమానిస్తున్నారు. ఇది టెక్నికల్ తప్పిదమే అయినా చెన్నై జట్టే.. రన్నరప్ అవుతుందని ఎలా ఊహించారు? అన్నది మరో ప్రశ్న. ఒకవేళ మ్యాచ్ ప్రారంభమై గుజరాత్ టైటాన్స్ బాగా ఆడి గెలిచినా.. టోర్నీ స్క్రిప్ట్ అన్న వాదనలు మరింత పెరుగుతాయి. అయితే ఇది స్క్రీన్ టెస్ట్‌లో భాగంగా డిస్ ప్లే చేశారన్న వార్తలు వినపడుతున్నాయి. ఈ తప్పిదంపై బీసీసీఐ ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి.

https://twitter.com/AG_knocks/status/1662798364352843782

https://twitter.com/IRFANAH25007193/status/1662804035550990337