Good Health : జ్వరం వచ్చినప్పుడు అన్నం తినాలా వద్దా..?

Good Health : జ్వరం వచ్చినప్పుడు అన్నం తినాలా వద్దా..?

మనం ఆకలేస్తే ఎక్కువగా తినేది అన్నమే. చపాతీలు, పండ్లు, స్వీట్స్, లాంటివి ఎన్ని తిన్నా కూడా అన్నం తిన్నంత తృప్తి ఉండదు చాలా మందికి. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఆకలి తీరాలంటే అన్నం మీదే డిపెండ్ అవుతుంటాం. అయితే, జ్వరం వచ్చినప్పుడు అన్నం తినొచ్చా లేదా అనే డౌట్ మనలో చాలా మందికి ఉంటుంది. జ్వరమొచ్చినప్పుడు అన్నం తింటే జ్వరం తగ్గదని, పైగా మరింత పెరుగుతుందని చాలామంది అభిప్రాయం.

జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏమీ రుచించక ఏది తినాలని అనిపించదు. దీనికి తోడు తిన్న కాస్త కూడా సరిగ్గా జీర్ణం కాదు. దీంతో జ్వరమొచ్చినప్పుడు డాక్టర్లు కూడా అన్నం తినొద్దని చెప్తుంటారు. జ్వరం వచ్చినప్పుడు నీరసంగా అనిపించటం సహజమే. ఒంట్లో శక్తి లేక శరీరభాగాలు చురుగ్గా పనిచేయవు.

ఇలాంటి సందర్భంలో అన్నం తింటే.. జీర్ణశక్తి సరిగ్గా లేక తిన్న తిండి జీర్ణం కాదు.దీంతో జ్వరంతో పాటు వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు అన్నంకి బదులు కొబ్బరినీళ్లు, బ్రెడ్, పాలు లాంటి నూనె తక్కువగా ఉన్న, తొందరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని డాక్టర్లు సజెస్ట్ చేస్తుంటారు. కాబట్టి జ్వరం వచ్చినపుడు అన్నం తినకుండా ఉండటంనే మంచిది. 

Also Read:మేకప్ ముందు, తర్వాత ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!