Good Health : ఉల్లి, వెల్లుల్లి పచ్చివి తింటే మంచిదా కాదా..?..ఈ విషయాలు తెలుసుకోండి..!

Good Health : ఉల్లి, వెల్లుల్లి పచ్చివి తింటే మంచిదా కాదా..?..ఈ విషయాలు తెలుసుకోండి..!

భారతీయ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్..టేస్ట్లో నంబర్ వన్..పసుపు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డలు, జీలకర్ర, మెంతులు,ఆవాలు ఇలా అనేక రకాల సుగంధ ద్రవ్యాలు మన వంటకాల్లో రోజూ వాడుతుంటాం.కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వాటిలో వెల్లుల్లి, సల్లట్( చిన్న ఉల్లిగడ్డలు) ఉన్నాయి. వీటిని మనం పచ్చిగా వివిధ రకాల పచ్చళ్లు, ఫిష్ ఫ్రైలు, కూరలు,సలాడ్ లలో వాడుతుంటాం. చాలామందిలో పచ్చి వెల్లుల్లి, షాలోట్స్(చిన్న ఉల్లిగడ్డలు) తింటే ఆరోగ్యపరంగా లాభమా నష్టమా అని సందేహం కలుగుతుంది. వెల్లుల్లి, సల్లట్ లను ఉడి కించకుండా తింటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

 రోగనిరోధక శక్తికి.. 

పచ్చి షాలోట్స్, వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలుంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులను దగ్గర చేరనీయవు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

కొలెస్ట్రాల్ పై..

పచ్చి షాలోట్స్, వెల్లుల్లిలో ఫైబర్లు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. యాంటీఆక్సిడెంట్లు కోలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. 

Also Read :- దసరాకు 6 వేల ప్రత్యేక రైళ్లు

జీవక్రియకు.. 

షాలోట్స్, వెల్లుల్లిలో గట్స్ బ్యాక్టిరియా వృద్ధికి సహాయపడే ప్రీ బయోటిక్ ఫైబర్ ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఉడికించిన ఉల్లిపాయలు జీర్ణక్రియకు మంచివని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

గుండె రక్షణకు..

షాలోట్స్, వెల్లుల్లిలో ఫైబర్స్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటు తగ్గించడంలో సహాయ పడతాయి. రక్తంలో లిపిడ్ ప్రొఫైల్ ను మెరుగు పరుస్తాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. 

వాపును తగ్గించడంలో.. 

పచ్చి షాలోట్స్, వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ కడుపులో మంటను తగ్గిస్తాయి. క్యాన్సర్, గుండె జబ్బుల వంటి ప్రాణాంతకమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

పచ్చి షాలోట్స్, వెల్లుల్లి అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా ఆహార పదార్థం అధిక పరిమాణంలో తీసుకుంటే అది మంచికంటే ఎక్కువ హానిని కలిగిస్తుందంటున్నారు. ఇవి ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, అలర్జీ వంటి సెడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయంటున్నారు.