సోషల్​ మీడియాను వదిలేయాలంటే సాధ్యమేనా..!

సోషల్​ మీడియాను వదిలేయాలనుకుంటున్నట్లు ప్రధాని మోడీ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. అయితే.. శాశ్వతంగా వదిలేయట్లేదని, వచ్చే ఆదివారం ఒక్క రోజు మాత్రమేనని చెప్పటంతో దీనిపై చర్చకు ఫుల్ ​స్టాప్​ పడింది. ఈ నేపథ్యంలో అసలు సోషల్​ మీడియాకు ఎవరైనా టెంపరరీగా లేదా పూర్తిగా గుడ్​బై చెప్పటం సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. సాధ్యమేనని ఆయా సంస్థలూ చెబుతున్నాయి. ఫేస్​బుక్​, ట్విట్టర్​, ఇన్​స్టాగ్రామ్​, యూట్యూబ్​ తదితర మేజర్​ ప్లాట్​ఫామ్​లు తమ యూజర్లకు ఈ ఆప్షన్లు ఇచ్చాయి.

ఈ రోజుల్లో చాలా మంది సోషల్​ మీడియాను ఫాలో అవుతున్నారు. ఒకటికి మించి ప్లాట్​ఫామ్​ల్లో అకౌంట్లు ఉంటున్నాయి. కొందరు అదే పనిగా అప్డేట్లు చూస్తుంటే మరికొందరు ఎప్పుడో తీరిక దొరికినప్పుడు మాత్రమే తిరగేస్తున్నారు. యూజర్లు ఒకవేళ ఆ ఖాతాలను వద్దనుకుంటే కొన్నాళ్లపాటు డీయాక్టివేషన్​లో ఉంచొచ్చు. లేదా పర్మనెంట్​గా డిలీట్​ చేసుకోవచ్చు. ఒకటీ రెండు తప్ప దాదాపు అన్ని సోషల్​ మీడియా సంస్థలూ ఈ రెండు ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చాయి. డీయాక్టివేట్​ చేసిన అకౌంట్లను రీయాక్టివేట్​ చేసుకోవచ్చు. కాకపోతే అకౌంట్లను ఓపెన్​ చేసేటప్పుడు ఇచ్చిన ఫోన్​ నంబర్​, మెయిల్, పాస్​వర్డ్​ గుర్తుంచుకోవాలి.

ఫేస్​బుక్​ని డీయాక్టివేట్​/డిలీట్​ చేస్తే ఏమౌతుంది?

ఫేస్​బుక్​ అకౌంట్​ని డీయాక్టివేట్​ లేదా డిలీట్​ చేయొచ్చు. డిలీట్​ అయిన అకౌంట్​ని తిరిగి యాక్టివేషన్​లోకి తేవటానికి కుదరదు. ఫొటోలు, పోస్టులు, వీడియోలు ఎట్సెట్రా అన్నీ పోతాయి. అలా జరక్కుండా ఉండాలంటే అకౌంట్​ని డిలీట్​ చేసే ముందు ఆ డేటాని డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. మన అకౌంట్​ డిలీట్​ అయినా ఇతరులు ఈ నెట్​వర్క్​లోకి పోస్ట్​ చేసిన మన ఫొటోలు మాత్రం ఎక్కడికీ పోవు. ఫేస్​బుక్​ అకౌంట్​ డిలీట్​ అయితే మెసెంజర్​ కూడా అందుబాటులో ఉండదు. అయితే ఫ్రెండ్స్​కి మనం పంపిన మెసేజ్​లను మాత్రం వాళ్ల ఇన్​బాక్సులో చూడొచ్చు. కాకపోతే వాటికి మన అకౌంట్​ పేరు ఉండదు. థర్డ్​ పార్టీ యాప్​ల్లోకి మన ఫేస్​బుక్​ అకౌంట్లతో లాగిన్​ అయితే అవీ క్యాన్సిల్​ అవుతాయి. ఆయా యాప్​లను భవిష్యత్​లో కూడా వాడుకోవాలనుకుంటే పాత అకౌంట్​ని డిలీట్​ చేసే ముందు అక్కడ మరో సోషల్​ నెట్​వర్క్​ అకౌంట్​ని ఓపెన్​ చేసుకోవటం బెటర్​.

ఫేస్​బుక్​ అకౌంట్​ను డీయాక్టివేట్ చేస్తే ప్రొఫైల్​ బయటికి కనిపించదు. ఫొటోలు, పోస్టులు, వీడియోలు డిలీట్​ కావు. మెసెంజర్​ కూడా అందుబాటులో ఉంటుంది. ఫ్రెండ్స్​తో చేసే చాటింగ్​లో మన ప్రొఫైల్​ పిక్చర్​ని​ చూడొచ్చు. నెట్​వర్క్​లో మన పేరుతో సెర్చ్​ చేయొచ్చు. థర్డ్​ పార్టీ యాప్​ల్లో ఫేస్​బుక్​ లాగిన్​ కొనసాగుతుంది. అకౌంట్​ రీయాక్టివేషన్​ కూడా చేసుకోవచ్చు.          ​

30 రోజుల్లోపైతే ఓకే

అకౌంట్​ని ఒకవేళ డిలీట్​ చేసినా ఆ డిలీట్​ని క్యాన్సిల్​ చేసే అవకాశాన్ని ఫేస్​బుక్​ కల్పిస్తోంది. ఈ ఛాన్స్​ 30 రోజుల్లోపే ఉంటుంది. డేటా మొత్తం డిలీట్​ కావటానికి 90 రోజులు పడుతుంది. అయినా ఆ డేటా వేరే యూజర్లకు అందుబాటులో ఉండదు.

ఫేస్​బుక్​ అకౌంట్​ని డిలీట్​​ చేసే విధానం

అకౌంట్​కి లాగినై, ఇన్ఫర్మేషన్​ మొత్తాన్ని డౌన్​లోడ్​ చేసుకోవాలి. డౌన్​లోడింగ్​ ఆప్షన్.. ఫేస్​బుక్​ ఇన్ఫర్మేషన్​ సెట్టింగ్స్​లో ఉంటుంది. ఇన్ఫర్మేషన్​ను డౌన్​లోడ్​ చేసుకున్నాక అకౌంట్​ డీయాక్టివేషన్ అండ్​ డిలీషన్​పై క్లిక్​ చేయాలి. అప్పుడు ‘కంటిన్యూ టు అకౌంట్​ డిలీషన్​’ అనే బటన్​ ఓపెన్​ అవుతుంది. దానిపై కొడితే పాస్​వర్డ్​ ఎంటర్​ చేయమని అడుగుతుంది. ​ ​

ఇన్​స్టాగ్రామ్​ విషయానికొస్తే

ఈ సోషల్​ మీడియా అకౌంట్​ని డీయాక్టివేట్​ చేయాలన్నా, డిలీట్​ చేయాలన్నా వెబ్​ బ్రౌజర్​ ద్వారానే సాధ్యం. ఎందుకంటే ఈ సెట్టింగ్​ ఐఓఎస్​, ఆండ్రాయిడ్​ యాప్​లో లేదు. ఒక్కసారి డిలీట్​ చేస్తే ప్రొఫైల్​, ఫొటోలు, వీడియోలు, కామెంట్లు, లైక్​లు, ఫాలోవర్స్​అన్నీ పర్మనెంట్​గా పోతాయి. అదే యూజర్​నేమ్​తో మళ్లీ సైనప్​ కావటం కుదరదు. మరో అకౌంట్​కీ ఈ యూజర్​నేమ్​ని యాడ్​ చేయలేం. డీయాక్టివేట్​ చేసినప్పుడు కూడా ఇవేవీ కనిపించవు గానీ రీయాక్టివేట్​ చేసినప్పుడు మాత్రం వాటిని తిరిగి పొందొచ్చు.

డీయాక్టివేట్​ చేసే విధానం

ఇన్​స్టాగ్రామ్​ ప్రొఫైల్​ పేజీలోని ఎడిట్​ ప్రొఫైల్​పై క్లిక్ చేయాలి. తర్వాత కిందికి వచ్చి ‘టెంపరర్లీ డిజేబుల్​ మై అకౌంట్​’ అనే ఆప్షన్​పై కొట్టాలి. అప్పుడు ‘ఎందుకు డీయాక్టివేట్​ చేస్తున్నారు’ అనే ప్రశ్న అడుగుతుంది. దానికి ఏదో ఒక ఆన్సర్​ని సెలెక్ట్​ చేసుకోవాలి. ఇది తప్పనిసరి. ఆన్సర్​ సెలెక్ట్​ చేసుకున్నాక పాస్​వర్డ్​ని రీఎంటర్​ చేయమని కోరుతుంది. రీయాక్ట్​వేట్​ చేసుకోవాలంటే పాస్​వర్డ్​ను గుర్తుపెట్టుకోవాలి.

ఇలా డిలీట్​ చేయొచ్చు​ ​

డిలీట్​ యువర్​ అకౌంట్​ పేజ్​లోకి వెళ్లాలి. ఎందుకంటే ఈ ఆప్షన్​ రెగ్యులర్​ సెట్టింగ్స్​లో ఉండదు. దీనికి బదులు అక్కడ ఒక లింక్​ ఉంటుంది. అది.. ఇస్టాగ్రామ్​ డాట్​కం/అకౌంట్స్​/రిక్వెస్ట్​/రిమూవ్​/పర్మనెంట్​. డిలీట్​ చేయాలన్నా ఏదో ఒక కారణం చెప్పాలి. అక్కడ ఉన్న కొన్ని రీజన్లలో ఒకదాన్ని సెలెక్ట్​ చేసుకోవాలి. ఇది మాండేటరీ. ఇప్పడు పాస్​వర్డ్​ని మళ్లీ ఎంటర్​ చేయాలి. తర్వాత ‘పర్మనెంట్లీ డిలీట్​ మై అకౌంట్​’ ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.

చానల్​ను హైడ్​, డిలీట్​ చేయొచ్చిలా..

యూట్యూబ్​కి లాగినై అడ్వాన్స్​డ్​ అకౌంట్​ సెట్టింగ్స్​కి వెళ్లాలి. అందులో కింద ‘డిలీట్​ చానల్​’ ఆప్షన్​ ఉంటుంది. అక్కడే హైడ్​ లేదా డిలీట్​ ఆప్షన్లనూ చూడొచ్చు. ‘హైడ్​ మై చానల్’​ అనే బటన్​ నొక్కితే సరిపోతుంది. చానల్​ని డిలీట్​ చేయాలంటే యూట్యూబ్​కి లాగినై పైన కనిపించే డిలీట్​ చానల్​ సెట్టింగ్స్​లోకి వెళ్లాలి. అక్కడ ‘ఐ వాంట్​ టు పర్మనెంట్లీ డిలీట్​ మై చానల్​’ అనే ఆప్షన్​ని సెలెక్ట్​ చేసుకోవాలి.  చానల్​ని డిలీట్​ చేయాలంటే కన్ఫర్మేషన్​ కోసం అక్కడ కనిపించే రెండు బాక్స్​లను సెలెక్ట్​ చేసుకోవాలి. ఒకటి.. డిలీట్​ మై చానల్​. రెండు.. డిలీట్​ మై కంటెంట్. ఈ రెండు ఆప్షన్లను సెలెక్ట్​ చేసుకుంటే అప్డేట్​కి టైమ్​ పడుతుందని యూట్యూబ్​ చెబుతుంది. అప్పటివరకు మన వీడియోల థంబ్​నెయిల్స్​ని సైట్​లో కొద్దిసేపు చూడొచ్చు. గూగుల్​ అకౌంట్​లో ఉండే వేరే డేటాపైన ఆ ఎఫెక్ట్​ పడదు.

ట్విట్టర్ పర్మటెంట్ డిలీట్ వీలు కాదు

ఈ ప్లాట్​ఫామ్​లో అకౌంట్​ డీయాక్టివేటింగ్​కి మాత్రమే ఛాన్స్​​ ఉంది. పర్మనెంట్​గా డిలీట్​ చేయటానికి ఆప్షన్​ లేదు. పైగా అకౌంట్​ డీయాక్టివేషన్​కి​ ముందే డేటాను డౌన్​లోడ్​ చేసుకోవాలి. ఎందుకంటే.. ‘డీయాక్టివేట్​ అయిన అకౌంట్లకు డేటా డౌన్​లోడింగ్​ లింక్​లు పంపటం కుదరదు’ అని ట్విట్టర్​ డీయాక్టివేషన్​ పేజీ చెబుతోంది. అంతేకాదు. డేటా డౌన్​లోడ్​ కోసం కూడా ముందుగానే రిక్వెస్ట్​ పెట్టాలి. డీయాక్టివేట్​ చేసేటప్పుడే ఎన్ని రోజుల్లో రీయాక్టివేట్​ చేసుకుంటామనే పీరియడ్​ని సెలెక్ట్​ చేసుకోవచ్చు.

దీనికి ప్రస్తుతం రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి.. 30 రోజులు. రెండు.. 12 నెలలు. ట్విట్టర్​ అనేది పబ్లిక్​ ప్లాట్​ఫామ్​ కాబట్టి మన అకౌంట్​ని డీయాక్టివేట్​ చేసుకున్నా కొద్దోగొప్పో గూగుల్​ లేదా బింగ్​ వంటి ఇన్ఫర్మేషన్​ సెర్చింజన్లలో అందుబాటులో ఉంటుంది. ట్విట్టర్​ అకౌంట్​ని డీయాక్టివేట్​ చేసుకోవాలంటే ప్రొఫైల్​ ఐకాన్​పై క్లిక్​ చేసి, ‘సెట్టింగ్స్ అండ్​ ప్రైవసీ’కి వెళ్లాలి. తర్వాత ‘అకౌంట్’​పై ట్యాప్​ చేసి, కిందకి వచ్చి ‘డీయాక్టివేట్​ యువర్​ అకౌంట్’ పైన బటన్​ నొక్కాలి. పాస్​వర్డ్​ ఎంటర్​ చేసి, ‘ఎస్​’పై క్లిక్​ కొట్టి కన్ఫామ్​ చేయాలి.

ఇలా డీయాక్టివేట్ చేయొచ్చు

ఫేస్​బుక్​ సెట్టింగ్స్​లోకి వెళ్లి, ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ దగ్గర ‘డీయాక్టివేషన్​ అండ్​ డిలీషన్’​పై క్లిక్​ చేస్తే, ‘కంటిన్యూ కావాలా’ అని అడుగుతుంది. ఓకే కొడితే పాస్​వర్డ్​ ఎంటర్​ చేయాల్సి ఉంటుంది.

యూట్యూబ్ చానల్ 

యూట్యూబ్​లో ‘హైడ్’​ లేదా ‘పర్మనెంట్లీ డిలీట్’​ ఆప్షన్లు ఉంటాయి. చానల్​ని హైడ్​ చేస్తే కామెంట్లు, వాటికి ఇచ్చే రిప్లైస్​ అన్నీ పర్మనెంట్​గా డిలీట్​ అవుతాయి. ఇతర గూగుల్​ ప్రాపర్టీస్​లో ఉండే చానల్ డేటా మాత్రం ఎక్కడికీ పోదు. కానీ.. చానల్​ పేరు, వీడియోలు, లైక్​లు, సబ్​స్క్రిప్షన్లు, సబ్​స్ర్కైబర్లు పబ్లిక్​కి అందుబాటులో ఉండవు. ‘ప్రైవేట్​’గా మారిపోతాయి. హైడ్​ చేసిన చానల్​ని రీయాక్టివేట్​ చేసుకోవచ్చు. ఒకవేళ యూట్యూబ్​ చానల్​ని డిలీట్​ చేస్తే చానెల్​ యూఆర్​ఎల్​, చానల్​ నేమ్​ ఎప్పటికీ ఇంటర్​నెట్​లో కనిపించవు.​ అనలిటిక్స్​లో సెర్చ్​ చేసినా దొరకవు. అగ్రిగేట్​ రిపోర్టుల్లో చానల్​ వాచ్​టైమ్​ డేటా అందుబాటులో ఉన్నా ఆ సమాచారం ఫలానా చానల్​ది అంటూ యూట్యూబ్​ సంస్థ చెప్పదు.