MF Investment: ఇప్పుడు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయెుచ్చా..?

MF Investment: ఇప్పుడు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయెుచ్చా..?

Small Cap Mutual Funds: కొన్ని నెలల కిందట దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ ర్యాలీ కొనసాగుతున్న సమయంలో ప్రధానంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ కంపెనీ షేర్లకు భారీగా డిమాండ్ కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్‌లో కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్‌కి ఎక్కువగా డిమాండ్ కనిపించింది. ఈ కేటగిరీ ఫండ్స్ అధికంగా ఇన్వెస్టర్లకు రాబడులను తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. 

అయితే ప్రస్తుతం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయటం సేఫేనా అవి ఊహించిన స్థాయిలో రాబడులను తెచ్చిపెడతాయా అనే అంశంపై చాలా మంది పెట్టుబడిదారుల రీసెర్చ్ కొనసాగుతోంది. మార్చి నెలలో స్ట్రెస్ టెస్ట్ రిపోర్టును పరిశీలిస్తే.. హైరిస్క్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ ఫోలియోలు లిక్విడేట్ చేయటానికి కనీసం 25 నుంచి 57 రోజుల మధ్య సమయం పట్టిందని తేలింది. పైగా చాలా స్కీమ్స్ తమ పోర్ట్ ఫోలియోలో 65 నుంచి 90 శాతం వరకు స్మాల్ క్యాప్ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నట్లు వెల్లడైంది.

అయితే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ తాజా డేటా ప్రకారం వేగంగా తమ పోర్ట్ ఫోలియోలోని స్టాక్స్ విక్రయించి లిక్విడేట్ చేయగలిగిన స్మాల్ క్యాప్ ఫండ్స్ జాబితా ఇక్కడ ఉంది. ఇందులో యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, డీఎస్పీ స్మాల్ క్యాప్ ఫండ్, హెచ్డీఎఫ్సీ స్మాల్ క్యాప్ ఫండ్, కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, టాటా స్మాల్ క్యాప్ పండ్ ఇందులో చోటు దక్కించుకున్నాయి. వీటిలో 50 శాతం పోర్ట్ ఫోయిలో విక్రయానికి 25 నుంచి గరిష్ఠంగా 63 రోజుల సమయం పట్టినట్లు తేలింది. 

స్ట్రెస్ టెస్ట్ అంటే ఏంటి.. ఇది దేనిని సూచిస్తుంది?
స్మాల్ క్యాప్ ఫండ్స్ విషయంలో "స్ట్రెస్ టెస్ట్" అనేది ఒక ప్యారామీటర్. ఇది మార్కెట్ తీవ్ర ఒత్తిడుల సమయంలో ఫండ్ ఎలా ప్రవర్తిస్తుందో అంచనా వేస్తుంది. ఉదాహరణకు మార్కెట్ క్రాష్, వడ్డీ రేటు పెంపు, లేదా ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితుల్లో ఫండ్ నష్టాలు ఎంతవరకూ వెళ్తాయో పరీక్షిస్తుంది. స్మాల్ క్యాప్స్ సాధారణంగా అధిక అనిశ్చితితో హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. ఈ వివరాలను ప్రతి నెల స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ అంతకు ముందు నెల డేటా ప్రకారం ప్రతినెల అందించాల్సి ఉంటుంది.