మీ పాలనలో నిరుద్యోగం పెరిగింది నిజం కాదా..?

మీ పాలనలో నిరుద్యోగం పెరిగింది నిజం కాదా..?
  • బండి సంజయ్కు మంత్రి హరీష్ రావు సవాల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కేంద్రంలోని బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగింది నిజం కాదా..? అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15 లక్షల 60వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఢిల్లీలో మిలియన్ మార్చ్ నిర్వహించాలంటూ ఆయన బీజేపీ  నేతలకు హితవు పలికారు. శనివారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలసి కొత్తగూడెం నర్సింగ్ కళాశాలను సందర్శించిన మంత్రి తన్నీరు హరీష్ రావు  మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలపై మండిపడ్డారు. 
బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్ తల తోక లేకుండా మాట్లాడుతున్నారని, ఉద్యోగాల భర్తీ కోసం మొదట కేంద్రంపై ఢిల్లీ లో దీక్ష చేపట్టాలని సవాల్ చేశారు. ఏడేళ్ల  బీజేపీ పాలనలో ఏ రంగం అభివృద్ధి చెందిందో చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. దేశంలో ఉద్యోగాలు,ఉపాది అవకాశాలు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. 

 

 

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు రీఓపెన్!

ఫ్రీజర్‌‌‌‌లో ఫుడ్‌‌ని స్టోర్‌‌‌‌ చేసేందుకు టిప్స్