ఏడేళ్ల క్రితం ‘జెర్సీ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా శ్రీనాథ్.. తనదైన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం సౌత్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్‌గా బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ మూవీలో కీలక పాత్రలో కనిపించింది. తాజాగా మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో స్ర్కీన్ షేర్ చేసుకోబోతోందట శ్రద్ధా. నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న ‘జైలర్ 2’లో ఆమె ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే శ్రద్ధా సెట్స్‌లో జాయిన్ కానుందని తెలుస్తోంది. మాస్, యాక్షన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘జైలర్’కి సీక్వెల్‌గా రాబోతున్న పార్ట్2పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఫస్ట్ పార్ట్‌లో నటించిన తమన్నా, యోగిబాబు, వినాయకన్, రమ్య కృష్ణ ఇందులోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
మరోవైపు ఓ తమిళ చిత్రంలో నటిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్.. తెలుగులోనూ మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. వాటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.