కమల ఇండియనా?.. నల్ల జాతీయురాలా?

కమల ఇండియనా?.. నల్ల జాతీయురాలా?
  • డొనాల్డ్ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు 

వాషింగ్టన్:  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న డెమోక్రటిక్ నామినీ కమలా హారిస్ పై రిపబ్లికన్  నామినీ డొనాల్డ్  ట్రంప్  తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘కమల ఇండియనా? లేక నల్ల జాతీయురాలా?” అని ప్రశ్నించారు. బుధవారం చికాగోలో నిర్వహించిన నేషనల్  అసోసియేషన్  బ్లాక్  జర్నలిస్టుల  సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే, కమల బ్లాక్ గానే గుర్తింపు పొందారని, బ్లాక్ యూనివర్సిటీలో చదువుకున్నారని ఒక జర్నలిస్టు చెప్పగా.. ‘‘కమల బ్లాక్  కాదు. ఆమె మొదటి నుంచి ఇండి యనే. అకస్మాత్తుగా ఆమె బ్లాక్  కార్డు అందుకున్నారు”అని ట్రంప్​ పేర్కొన్నారు.