పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినిమాలకి గుడ్ బై చెప్పనుందా..?

పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినిమాలకి గుడ్ బై చెప్పనుందా..?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు ఆంథోని తత్తిల్ తట్టిల్ ని గోవాలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహానికి భారీ ఎత్తున సన్నహితులు సినిమా ఇండస్ట్రీ నుంచి సెలెబ్రెటీలు హాజరయ్యారు. ప్రస్తుతం కీర్తి సురేష్ సినిమా షూటింగులకి బ్రేక్ ఇచ్చి వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. 

అయితే గత కీర్తి సురేష్ పెళ్లి తర్వాత పలు రూమర్స్, గాసిప్స్ వైరల్ అవుతన్నాయి. ఇందులో ముఖ్యంగా పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినిమాలకి గుడ్ బై చెప్పి తన భర్తతో కలసి దుబాయ్ దేశంలో సెటిల్ కాబోతోందని పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆంథోని కి దుబాయ్ లో పలు వ్యాపారాలు ఉన్నాయి. అలాగే తన భర్తతో కలసి బిజినెస్ పనుల్లో తోడుగా ఉండాలని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుందని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే కీర్తి సురేష్ మాత్రం గాసిప్స్, రూమర్స్ పై స్పందించ లేదు. దీంతో ఈ వార్తలో నిజమెంతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ALSO READ | Rashmika and Vijay: విజయ్ సినిమా విషయంలో పొరపాటున నోరు జారిన రష్మిక.. సారీ అంటూ ట్వీట్..

ప్రస్తుతం కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన బేబీ జాన్ అనే బాలీవుడ్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ప్రముఖ స్టార్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించగా తమిళ్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 25న వరల్డ్ వైడ్ గా ప్యాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇది కాకుండా ఇప్పటికే రివాల్వర్ రీటా, కన్నివేది(తమిళ్) రెండు సినిమాల్లో మెయిన్ లీడ్ పాత్రల్లో నటిస్తోంది. ఈ సినిమాల షూటింగులు కూడా దాదాపుగా తుది దశలో ఉన్నాయి.