![Laila movie Day 1 collections: లైలా మూవీ కలెక్షన్ ఇంత దారుణమా.. సినీ ఇండస్ట్రీలోనే ఇదో రికార్డ్..](https://static.v6velugu.com/uploads/2025/02/is-laila-movie-disaster-openings-in-vishvak-sen-career_EkG3RDiY0e.jpg)
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన "లైలా" మూవీ ప్రేమికులు దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 న రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ, కమెడియన్ పృథ్వి, అభిమన్యు సింగ్, బబ్లూ పృథ్వీ రాజ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఫస్ట్ టైమ్ విశ్వక్ సేన్ ఈ సినిమాలో లేడీ గెటప్ లో కనిపించి అలరించే ప్రయత్నం చేశాడు. కానీ పెద్దగా వర్కౌట్ కానట్లు తెలుస్తోంది.
Sacnilk సమాచారం ప్రకారం మొదటి రోజు లైలా మూవీవరల్డ్ వైడ్ గా రూ.1.25 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైలా అంటూ ట్రోలింగ్ అవుతుండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా అవ్వలేదు. బుక్ మై షోలో 9వేల టికెట్లు మాత్రమే బుక్ అయినట్లు సమాచారం. దీంతో కంప్లీట్ గా మౌత్ పబ్లిసిటీ ఆధారపడింది. కానీ మొదటి షో పడిన తర్వాత నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ దారుణంగా పడిపోయాయి.
ALSO READ | Thaman: తమన్‌కి బాలయ్య కాస్ట్లీ కార్ గిఫ్ట్.. ధరెంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే...
ప్రస్తుతం టికెట్లు తెగక థియేటర్లు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం నిర్మాత సాహూ గారపాటి దాదాపుగా రూ.35 కోట్లు బడ్జెట్ ఖర్చు చేశారు. దీంతో ఖర్చులన్నీ పోను బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.10 కోట్లు పైనే ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ అందుకోవడం కూడా కష్టమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ వైసీపీ పార్టీపై చేసిన కామెంట్లు కలెక్షన్స్ పై పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ వైసీపీ పార్టీ ఎన్నికల ఫలితాలని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వైసీపీ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఏకంగా బాయ్ కాట్ లైలా, డిజాస్టర్ లైలా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత విశ్వక్, పృథ్వీ క్షమాపణలు చెప్పినప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. దీంతో సినిమా ఈవెంట్లలో రాజకీయాలు మాట్లాడితే ఏం జరుగుతుందో మేకర్స్ ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు.