మేనల్లుడి సినిమాలో మహేష్ బాబు ఆ పాత్రలో నటిస్తున్నాడా..?

మేనల్లుడి సినిమాలో మహేష్ బాబు ఆ పాత్రలో నటిస్తున్నాడా..?


టాలీవుడ్ యంగ్ హీరో అశోక్ గల్లా తెలుగులో "దేవకీ నందన వాసుదేవ" సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సివిమలో అశోక్ కి జోడీగా మానస వారణాసి నటిస్తుండగా ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడిపాత్రలో నటించిన ప్రముఖ హిందీ నటుడు దేవదత్త గజానన్ నాగే ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. 

అయితే ఈ సినిమాకి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు దేవకీ నందన వాసుదేవ సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రలో నటించాడని కానీ సినిమాపై క్యూరియాసిటి క్రియేట్ చేసేందుకు ఇప్పటివరకూ చిత్ర యూనిట్ ఈ విషయాన్ని బయటపెట్టలేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలోని పాత్ర  కోసమే మహేష్ జుట్టు పెంచి లుక్ మార్చడాని మరికొందరు అంటున్నారు.

అయితే అశోక్ గల్లా మహేష్ కి స్వయానా మేనల్లుడు కావడంతో కామియో అప్పియరెన్స్ రోల్ కి మహేష్ ఒకే చెప్పినట్లు సమాచారం. అయితే మహేష్ దేవకీ నందన వాసుదేవ లో శ్రీకృష్ణుడి పాత్రలో నటిస్తున్నట్లు వినిపిస్తున్న వార్తలపై చిత్ర యూనిట్గానీ, అటు మహేష్గానీ  స్పందించలేదు. దీంతో ఈ వార్తలో నిజమెంతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ALSO READ | Suriya Jyothika:18 ఏళ్ల తర్వాత జోడీగా సూర్య, జ్యోతిక.. తెరపై అద్భుతం చూపించనున్న లేడీ డైరెక్టర్!

ఇక ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ కథని అందించగా నూతన డైరెక్టర్ అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నాడు. లలితాంబికా ప్రొడక్షన్స్బ్యానర్ పై సినీ నిర్మాత సోమినేని బాలకృష్ణ నిర్మిస్తుండగా స్టార్ మ్యూజిక్ డైరక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. ఇప్పటికే దేవకీ నందన వాసుదేవ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నవంబర్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.