టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జక్కన్న ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని SSMB29 అనే వర్కింగ్ తాటిల్ తో తెరకెక్కిస్తున్నాడు. అయితే SSMB29 షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నెల చివరివారంలో స్టార్ట్ కానుందని గతంలో రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పాడు. ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించి గ్లోబల్ వైడ్ రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూతోపాటు టెక్నీషయన్స్ విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇందులోముఖ్యంగా ఇంటర్నేషనల్ గ గుర్తింపు పొందిన నటీనటుల్ని సెలెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ని సెలక్ట్ సమాచారం.
అయితే SSMB29లో విలన్ పాత్ర కోసం మళయాళ ప్రముఖ హీరో ప్రిథ్వి రాజ్ సుకుమారన్ ని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే SSMB29 టీమ్ ప్రిథ్వి రాజ్ ని సంప్రదించగా కథ విని వెంటనే ఒకే చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే SSMB29 ప్రిథ్వి పాత్రకి సంబందించిన స్క్రీన్ టెస్ట్ కూడా పూర్తవడంతో త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా పృథ్వీ రాజ్ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన మల్టీ స్టారర్ సలార్ సినిమలో నటించాడు. ఈ సినిమా ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో పృథ్వీ రాజ్ హీరో ఫ్రెండ్ పాత్రలో నటించి అలరించాడు. ఆలాగే పృథ్వీ రాజ్ నటించిన ఆడుజీవితం(మళయాళం) సినిమాలో కూడా తన యాక్టింగ్ తో సినీ విమర్శకుల నుంచి ప్రసంశలు అందుకున్నాడు. ప్రస్తుతం మోహన్ లాల్ తో గాడ్ ఫాథర్ సినిమా సీక్వెల్ అయిన ఎల్2: ఎంపురాన్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.