ప్రస్తుతం తెలుగు ప్రముఖ స్టార్ హీరో ప్రభాస్ స్పిరిట్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి టాలీవుడ్ డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. స్పిరిట్ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్ కపుల్స్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరుగతున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ ప్రస్తుతం కల్కి చిత్రం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే స్పిరిట్ చిత్ర షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.
అయితే ఇటీవలే స్పిరిట్ చిత్రంలో మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి హీరో ఫాదర్ పాత్రలో నాటిస్తున్నట్లు పలు వార్తలు నెట్టింట్లో బలంగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మమ్ముట్టి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీంతో మమ్ముట్టి స్పిరిట్ చిత్రం పాత్ర చర్చనీయాంశంగా మారింది.
ALSO READ | విశ్వం ట్రైలర్ విడుదల: దసరాకి దేశంలో దీపావళి జరగబోతోంది అంటూ..
కానీ స్పిరిట్ చిత్రంలో మమ్ముట్టి నటిస్తున్నట్లు వినిపిస్తున్న వార్తలపై ఇప్పటివరకూ చిత్ర యూనిట్ మరియు మమ్ముట్టి స్పందించలేదు. దీంతో ఈ వార్తలో నిజమెంతుందనేది తెలియాలి.
ఈ విషయం ఇలా ఉండగా మమ్ముట్టి తెలుగులో ఆమధ్య యాత్ర, యాత్ర 2 చిత్రాల్లో నటించాడు. ఈ చిత్రాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితగాథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రాలు ప్రేక్షకుల్ని బాగానే అలరించాయి. మలయాళంలో ప్రముఖ డైరెక్టర్ వ్యాసక్ డైరెక్ట్ చేసిన టర్బో అనే చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం కూడా ఫర్వాలేదనిపించింది.