![Viral video: వీళ్ల పనే బాగుంది..ఫోన్ ఛార్జింగ్ చేస్తూ..గంటకు రూ.1000 సంపాదన](https://static.v6velugu.com/uploads/2025/02/is-man-making-money-by-charging-phones-at-kumbh-mela-know-the-real-truth-behind-viral-video_5YG8Om9Eex.jpg)
యూపీలో ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా కొనసాగుతోంది. దేశ విదేశాలనుంచి భక్తులు తరలివస్తున్నారు. ప్రయాగ్ రాజ్ లో ఎక్కడ చూసిన జనమే. ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిపోయింది..త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి తరించిపోతున్నారు.మరోవైపు మహాకుంభంలో వివిధ బిజినెస్ లు చేయడం బాగా డబ్బు సంపాదించడం,ఇతరులు అదే విధంగా చేయడానికి చిట్కాలు ఇవ్వడం వంటి అనేక వైరల్ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.
దొరికిందే అవకాశం అన్నట్లుగా కొంతమంది అందినకాడికి దోచుకుంటున్నారు. వాహనాల రద్దీతో ప్రయాణికులను ఇబ్బందులను ఆసరాగా చేసుకొని అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక సెల్ ఫోన్ ఛార్జింగ్ చేస్తూ కూడా సంపాదిస్తున్నారు. ఛార్జింగ్ పెడుతూ ఓ వ్యక్తి గంటలకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నట్లు చూపిస్తున్న వీడియాలో ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ అవుతోంది.
ప్రయాగ్ రాజ్ లో ఓ ప్రాంతంలో ఆరుబయట కూర్చున్న వ్యక్తి పది సెల్ ఫోన్ ఛార్జర్లను పెట్టుకుని ఉన్న వీడియో సోషల్ మీడియాల కనిపిస్తోంది. ఇలా గంటకు ఒక సెల్ ఫోన్ ఛార్జింగ్ రూ. 50 ల చొప్పున్న వసూలు చేస్తున్నాడు. దీంతో అతని గంట ఆదాయం రూ. 1000. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఓ ప్రయాణికుడు షేర్ చేయడంతో వైరల్ అయింది. సమయం దొరికిందని అవసరాలను ఆసరాగా దోచుకుంటున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక కొందరైతే అక్కడ ఆ సౌకర్యం దొరకడమే కష్టం కదా.. సమయానికి సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఇబ్బందులు పడాల్సిందే కదా అని అంటున్నారు.