
మెగా హీరో రామ్‍చరణ్, భారత దిగ్గజ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మధ్య మంచి అనుభందం ఉంది. చాలా సందర్భాల్లో వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం బయటకు వచ్చింది. లేటెస్ట్గా ఈ పరిచయాలే, వీరి కలయిక (RC16లో) భాగం కానుందనే టాక్ నెట్టింట్లో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే..
ఆర్‌సీ16లో ధోనీ నటిస్తారనే వార్తా..ఇపుడు ఎక్కడ చూసిన సినీ, క్రికెట్ ఫ్యాన్స్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో రామ్ చరణ్ కోచ్గా ధోని నటిస్తున్నట్లు టాక్ మొదలైంది. అందుకు గల బలమైన కారణాలు ఉన్నాయి.
ఇటీవల హైదరాబాద్లో జరిగిన షెడ్యూల్లో క్రికెట్కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు మేకర్స్. ఈ క్రమంలో ఇందులో ధోని నటిస్తున్నట్లు వార్తా అంతటి చుట్టేస్తూ వస్తోంది. అలాగే, నితిన్ హీరోగా వస్తోన్న రాబిన్ హుడ్ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దాంతో రామ్ చరణ్ RC16లో కూడా ధోని నటిస్తున్నట్లు పుకార్లు ఊపందుకున్నాయి.
Also Read : రష్మిక మందన్న డ్యాన్స్ బీట్ వైరల్
#RC16 లో క్రికెటర్ ధోనీ..?#RamCharan స్పోర్ట్స్మన్గా నటిస్తుండగా తనకు కోచ్ పాత్రలో #MSDhoni గెస్ట్ అప్పియరెన్స్
— Ramesh Pammy (@rameshpammy) March 16, 2025
@msdhoni @AlwaysRamCharan pic.twitter.com/mqdQlycgNl
అయితే, ఈ విషయంపై RC16మేకర్స్ స్పందించినట్లు సినీ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో ధోనీ నటించడం లేదని, ఆ దిశగా చర్చలు జరగలేదని చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ఈ విషయంపై సినీ,క్రికెట్ ఫ్యాన్స్కి ఓ క్లారిటీ వచ్చేసింది.
ఇకపోతే, ధోని అండ్ చరణ్ గతంలో ముంబైలో కలిసి ఓ యాడ్ షూట్ కూడా చేశారు. అప్పుడు కలిసి మాట్లాడుకుని ఫోటోలు కూడా దిగారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు బయటికి రావడంతో రూమర్స్ షురూ అయ్యాయి.
అంతేకాకుండా ఇప్పటికే 'ధోని ఎంటర్టైన్మెంట్స్' అనే బ్యానర్ స్థాపించి తమిళ్లో ఓ మూవీ నిర్మించాడు కూడా. ఈ క్రమంలో బిగ్ స్క్రీన్ మీదకు ధోని ఎంట్రీ ఇస్తాడని చర్చించుకుంటున్నారు. మరి ధోని ఆగమనం ఎప్పుడో చూడాలి.
బుచ్చిబాబు రూపొందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం RC16 అనే వర్కింగ్ టైటిల్లో షూటింగ్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ AR రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ దాదాపుగా రూ.300 కోట్లు బడ్జెట్ వెచ్చించి నిర్మిస్తున్నారు.