బేబీ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న బడా బ్యానర్... నిజమేనా.?

బేబీ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న బడా బ్యానర్... నిజమేనా.?

తెలుగు సినిమాలకి ఈ మధ్య నార్త్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో కొందరు దర్శకనిర్మాతలు తమ సినిమాల్ని హిందీ, బెంగాలీ తదితర భాషల్లో దబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. దీనికితోడు నార్త్ లో ఎక్కువగా వాడుక భాష హిందీ ఉండటంతో సినిమా యావరేజ్ టాక్ ఉన్నాసరే మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. దీంతో సౌత్ సినీ దర్శకులు నార్త్ పై దృష్టి సారిస్తున్నారు. 

అయితే తెలుగులో ఆమధ్య వచ్చిన బేబీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే రీమేక్ రైట్స్ కూడా లాక్ చేసినట్లు సమాచారం. కానీ బేబీ హిందీ రీమేక్ లో నటించే నటీనటులెవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. 

ఈ సినిమాలో తెలుగు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ఆనంద్, నాగబాబు, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ నీలం లవ్ & ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు. నేటి యువతరం కంఫర్ట్స్ మోజులోపడి రిలేషన్ షిప్స్ ఎలా నాశనం చేసుకుంటున్నారనే విషయాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. దీంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సాంగ్స్ ఒక ఊపు ఉపాయి.

తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా దాదాపుగా రూ.75 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన వైష్ణవి చైతన్య, దర్శకుడు సాయి రాజేష్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అయితే నార్త్ లో ఈ మధ్య కామెడీ హర్రర్, లవ్ అండ్ ఎమోషన్స్ జోనర్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే క్లిక్ అవుతున్నాయి. దీంతో మంచి క్యాస్ట్ అండ్ క్రూతో ఎమోషనల్ సీన్స్ కరెక్ట్ గా ప్లాన్ చేస్తే మరో రూ.100 కోట్లు ఈజీగా కొడుతుందని కొందరు నెటిజన్లు అంటున్నారు.

 అయితే ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా తమిళ్ లో అజిత్ కుమార్ "గుడ్ బ్యాడ్ అగ్లీ" సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక హిందీలో ప్రముఖ హీరో సన్నీ డియోల్ చేస్తున్న "జాట్" సినిమాతో బాలీవుడ్ లో పాగా వేసేందుకు సిద్దమవుతున్నారు. దీన్నిబట్టి చూస్తే త్వరలోనే బాలీవుడ్ లోకి ఇతర సినీ నిర్మాతలు కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్ నటీనటులు కూడా సౌత్ సినిమాల్లో నటించేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.