సంక్రాంతి బరిలో నాగచైతన్య తండేల్.. నిజమేనా..?

సంక్రాంతి బరిలో నాగచైతన్య తండేల్.. నిజమేనా..?

తెలుగు ప్రముఖ హీరో నాగ చైతన్య ప్రస్తుతం ‘తండేల్’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాగచైతన్యకి జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు ప్రముఖ డైరెక్టర్ చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.  అయితే తండేల్ చిత్రం ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ పనులు పూర్తీ కాకపోవడంతో అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి.

టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం తండేల్ చిత్రాన్ని జనవరి నెలలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాత అల్లు అరవింద్ విదేశాలలో ఉండటంతో తిరిగివచ్చిన తర్వాత రిలీజ్ డేట్ పై నిర్ణయం తీసుకొనున్నట్లు సమాచారం. 

అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న రిలీజ్ కానుంది.  అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్‌బీకే 109 చిత్రం కూడా రేసులో ఉంది. వీటన్నింటినిబట్టి చూస్తే తండేల్ సినిమా రిలీజ్ సంక్రాంతికి కూడా లేనట్లు తెలుస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా తండేల్ చిత్రం రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రంలో నాగచైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్ర ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.40 కోట్లకు కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీంతో తండేల్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.