వాలైంటెన్స్ డే రోజున ఆ ఓటిటిలో నాగచైతన్య పెళ్లి వీడియో రిలీజ్ కానుందా..?

వాలైంటెన్స్ డే రోజున ఆ ఓటిటిలో నాగచైతన్య పెళ్లి వీడియో రిలీజ్ కానుందా..?

ఈమధ్య సినీ ఇండస్ట్రీలలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. కొన్ని ఓటిటి సంస్థలు సినీ సెలబ్రెటీల పెళ్లి స్ట్రీమింగ్ హక్కుల కోసం కోట్ల రూపాయల వెచ్చిస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, కియారా అద్వానీ, నయనతార, ప్రియాంక చోప్రా, దీపికా పడుకునే తదితర స్టార్ హీరోయిన్ల పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ ఏకంగా వందల కోట్ల రూపాయలు వెచ్చించాయి. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో అక్కనేని నాగ చైతన్య పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ ని కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ. 50 కోట్లు బడ్జెట్ వెచ్చించినట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే నాగ చైతన్య సమంతతో విడాకుల తర్వాత మరో స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ ని పెళ్లి చేసుకున్నాడు. వీరివివాహం గత తేడాది డిసెంబర్ నెలలో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి తెలుగు, తమిళ్, హిందీ సినిమా పరిశ్రమల నుంచి సినీ సెలెబ్రెటీలు హాజరై వధూ వరులని ఆశీర్వదించారు. కానీ ఈ పెళ్ళికి ఇతర ఫొటోగ్రాఫర్లు, విలేఖర్లు, మీడియాని అనుమతించలేదు. దీంతో పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ కి అమ్మేశారని అందుకే బంధు మిత్రులని తప్ప ఇతరులని అనుమతించలేదని పలు రూమర్స్ వినిపించాయి. దీంతో కొందరు అక్కినేని కుటుంబ సభ్యులు నాగ చైతన్య శోభిత పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ ఎవరికీ అమ్మలేదని రూమర్స్ ని ఖండించారు.

ALSO READ | Pushpa2TheRule: రప్పా రప్పా ఇంటర్నేషనల్ ర్యాంపేజ్.. పుష్పరాజ్ విధ్వంసానికి ఈ వీడియో ఉదాహరణ

 కానీ పెళ్లయిన 2 నెల్ల తర్వాత పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ గురించి మళ్ళీ పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నాగ చైతన్య పెళ్లిని నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేయనున్నారని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఈసారి అక్కినేని కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఈ విషయం ఇలా ఉండగా నాగ చైతన్య హీరోగా నటించిన "తండేల్" ఈ నెల 7న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా ప్రముఖ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది.