స్టార్ హీరోయిన్ కి నాన్ బెయిలబుల్ వారెంట్.?

స్టార్ హీరోయిన్ కి నాన్ బెయిలబుల్ వారెంట్.?

ఎమర్జెన్సీ మూవీతో ముందుకు వచ్చిన కంగన రనౌత్ తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో ఓ రెస్టారెంట్ ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. ది మౌంటైన్ స్టోరీ పేరుతో హి మాలయాల్లో ఏర్పాటు చేసిన కేఫ్.. ఈ నెల 14వ తేదీన ఓపెన్ కానుంది. అదే సమయంలో మరో వార్త హాట్ టాపిక్ గా మారింది.

ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంటు జారీ కానుందని తెలుస్తోంది. బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అక్తర్ ఆధ్వర్యంలో 2016 మార్చిలో ఓ మీటింగ్ జరిగింది. ఈ సమావేశం అనంతరం కంగన రనౌత్ కు జావేద్ కు వాగ్వాదం మొదలైంది. అది కాస్తా చినికి చినికి గాలివానలా మారి కేసుల దాకా వెళ్లింది. 

ALSO READ | 2 సార్లు విడాకుల తర్వాత 59 ఏళ్ళ వయసులో మళ్ళీ ప్రేమలో పడ్డ స్టార్ హీరో..

ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగనా జావేద్ పై తీవ్ర ఆరోప ణలు చేశారు. తన ప్రతిష్ఠను దెబ్బతీశారని పేర్కొంటూ కంగనాపై ఆయన పరువు నష్టం దావా వేశారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తోంది. ఆమె దావాలకు గైర్హాజరవుతుండటం తోనాస్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని జావేద్ తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేసి నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా నటి కంగనా రనౌత్ ఎమర్జెన్సీ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకోలేక పోయింది. 1975 సమయంలో జరిగిన కొని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించగా పలు చోట్ల ఈ సినిమాని ఆడకుండా బ్యాన్ చేశారు. దీంతో ఈ ప్రభావం కలెక్షన్స్ పై పడింది.