- 73, 74 రాజ్యాంగ సవరణ స్ఫూర్తి మేరకే గ్రామాలకు నేరుగా నిధులు విడుదల
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ చిల్లర బుద్దిని చూడలేకే... మీ కమీషన్ల కోసం పంచాయతీ నిధుల దారి మళ్లింపును ఆపేందుకే... రాజ్యాంగ సవరణ స్పూర్తి మేరకే గ్రామాలకు నేరుగా నిధులు విడుదల చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్రమే నేరుగా గ్రామాలకే నిధులివ్వాలనుకోవడం చిల్లర వ్యవహారమంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ పై బండి సంజయ్ మండిపడ్డారు. మీ పాలనలో సర్పంచులు అడుక్కుతినే దుస్థితికి చేరింది వాస్తవం కాదా?.. మీ తప్పులను ప్రశ్నించిన సర్పంచులను సస్పెండ్ చేస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. 73, 74 రాజ్యాంగ సవరణ స్పూర్తి మేరకే గ్రామాలకు నేరుగా నిధులు ఇస్తున్నారని బండి సంజయ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
దిశా ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు విచారణ.. ప్రకటనపై ఉత్కంఠ