
కేటీఆర్, హరీశ్ రావు.. ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటున్న మాట వాస్తవమా కాదా అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు.
కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో సీఎం వ్యాఖ్యలు..
- మేము తెలంగాణ కోసం నిరంతరం కృషి చేస్తున్నాం
- బీజేపీ, బీఆర్ఎస్ మాపై కుట్రలు చేస్తున్నాయి
- కేటీఆర్, హరీష్ ఢిల్లీకి ఎందుకు చక్కర్లు కొడుతున్నారు
- మోదీ కాళ్లు పట్టుకుంటున్నది నిజం కాదా
- ఈ ఎన్నికల్లో మనం గెలవాల్సిందే
- కాంగ్రెస్ ను ఓడించాలని బీఆర్ఎస్ అంటోంది
- పోటీలో లేని బీఆర్ఎస్ మమ్మల్ని ఓడించాలని అంటోంది
- అంటే మరి ఎవరిని గెలిపించాలని చెబుతోంది
- కవిత, కేటీఆర్, హరీష్ ఎవరికి ఓటేస్తారు
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయట్లేదు
- బీఆర్ఎస్ వాళ్లు ఎవరికి ఓట్లేస్తారో చెప్పాలి
- కేసులనుంచి తప్పించుకునేందుకు మోదీ జపం చేస్తున్నారు
- తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర పెట్టారు
- బీఆర్ఎస్ కు డిపాజిట్ పోయిన చోట బీజేపీ గెలిచింది.
- వీళ్ల డిపాజిట్లు పోతే.. వాళ్లు గెలిచారు.. అంటే బీజేపీని గెలిపించింది ఎవరు..?
- క్రీడల్లో రాణించిన వారిని ప్రోత్సహిస్తున్నాం.
- సిరాజ్, నిఖిత్ జరీన్ కు డీఎస్పీ జాబ్స్ ఇచ్చాం
- విద్య, క్రీడలను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు
- మొదటి ఏడాదిలోనే 56 వేల ఉద్యోగాలు ఇచ్చాం
- మా పనితనం నచ్చకపోతే ఓటేయకండి
- గతంలో మీకు ఒకటో తేదీన జీతాలు పడేవా
- మా ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలు ఇవ్వట్లేదా
- మీ మనసు మీద చేయి వేసుకుని ఓటేయండి