టాలీవుడ్ ప్రముఖ హీరో యంగ్ డైరెక్టర్ టైగర్ ఎన్టీఆర్ మరియు స్టార్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్, మరాఠీ నటి శృతి మరాఠీ నటించగా సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, అజయ్, అభిమన్యు సింగ్, ప్రధాన తారాగణంగా నటించారు. ఈ సినిమా ని టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.
అయితే యాక్షన్ డ్రామా థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన దేవర సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ విడుదల అయిన రోజునుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.550 కోట్లు(గ్రాస్) కలెక్షన్లు ఉన్నాయి.
దేవర సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సినిమా మరియు వెబ్ సీరీస్ నిర్మాణ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. దీనితో దేవర పార్ట్ 1 నవంబర్ 8వ తారీఖునుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే పలు వార్తలు నెట్టింట్లో బలంగా వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై ఇటు నెట్‌ఫ్లిక్స్ గానీ అటు దేవర చిత్ర యూనిట్ స్పందించలేదు. దీంతో నిజమెంతనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ విషయం ఇలా ఉండగా రోజురోజుకి దేవర చిత్రం కలెక్షన్లు తగ్గిపోతున్నాయి. అలాగే హిందీ, తమిళ్, మలయాళ భాషలలో పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.