Prabhas-Singham Again: ప్రభాస్ కామియో రోల్‍..ఆ దర్శకుడి వీడియోతో క్లారిటీ వచ్చేసింది

Prabhas-Singham Again: ప్రభాస్ కామియో రోల్‍..ఆ దర్శకుడి వీడియోతో క్లారిటీ వచ్చేసింది

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి (Rohit shetty) డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సింగం ఎగైన్ (Singham again). అజయ్‌ దేవగన్ (Ajay Devgan),అక్షయ్ కుమార్ (Akshay kumar), రణ్‌వీర్ సింగ్(Ranveer singh) ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో స్టార్ బ్యూటీ దీపికా పదుకొనె(Deepika padukone) హీరోయిన్ గా నటిస్తోంది. దీపికా ఈ సినిమాలో లేడీ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. 

తాజాగా ఈ మూవీ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇవాళ (సెప్టెంబర్ 30) ఇన్‍స్టాగ్రామ్‍లో ఓ వీడియో పోస్ట్ చేశారు. "ఈ హీరో లేకుండా సింగం కంప్లీట్ అవదు. ఈ దీపావళికి స్కార్పియో కచ్చితంగా వస్తుంది..తిరుగుతుంది. అయితే, ఎంట్రీ వేరే వాళ్లది ఉంటుంది” అని రోహిత్ శెట్టి పోస్ట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ చేసిన ఈ వీడియోతో ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. 

అదేంటంటే..ఈ వీడియోకు ప్రభాస్ నటించిన కల్కి 2898ADలోని బుజ్జీ థీమ్‍ను బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍గా పెట్టారు. అంతేకాకుండా కల్కి మ్యూజిక్‍ను ఈ వీడియోకు వాడడం, ఈ హీరో లేకుండా సింగం అసంపూర్ణం అని, ఎవరో ఎంట్రీ ఇవ్వనున్నారని క్యాప్షన్ పెట్టడంతో..ఈ మూవీలో హీరో ప్రభాస్ క్యామియో రోల్‍లో కనిపించనున్నారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. త్వరలో మేకర్స్ నుంచి క్లారిటీ రానుంది.

ఒకవేళ ప్రభాస్ క్యామియో కనుక ఈ సినిమాలో ఉంటే మాత్రం మరోసారి హిందీ బాక్సాఫీస్ లు బద్దలవ్వడం కన్ఫమ్. అలాగే సింగం అగైన్ చిత్రానికి హైప్ భారీగా పెరుగుతుంది. ఎందుకంటే, హిందీలోనూ బాలీవుడ్ హీరోలకు మించిన క్రేజ్ ప్రభాస్‍కు ఉండడం విశేషం. ప్రభాస్ కల్కి 2898AD హిందీ బెల్ట్ లైఫ్ లాంగ్ కలెక్షన్స్ రూ.291.13 కోట్లు సాధించింది. బాహుబలి 1, మరియు 2 లతోనే ప్రభాస్ బాలీవుడ్ నాట కలెక్షన్ల జెండా ఎత్తాడు. ఆ పరంపరను కల్కితో కొనసాగించాడు. 

ALSO READ : Prasanth Varma: నా యూనివర్స్‌ నుంచి త్వరలో కొత్త తేజస్సు..ప్రశాంత్ వర్మ పోస్ట్‌ మోక్షజ్ఞ కోసమేనా!: క్లారిటీ

ఇకపోతే సింగం అగైన్ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‍గణ్, అక్షయ్, కరీనా,రణ్‍వీర్ సింగ్ కూడా క్యామియో రోల్స్‌లో కనిపించనున్నారు. దీపికా పదుకొణ్, టైగార్ ష్రాఫ్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్, దయానంద్ శెట్టి, శ్వేతా తివారీ కీలకపాత్రలు పోషించారు.అయితే ఈ సినిమాను ముందుగా ఆగస్టు 15న విడుదల చేయాలనీ అనుకున్నారట మేకర్స్. కానీ, షూటింగ్ ఆలస్యమవటంతో దీపావళికి ఈ మూవీని తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.