ప్రభాస్ ఆ స్టార్ హీరో మల్టీస్టారర్ సినిమా ఆఫర్ ని రిజెక్ట్ చేశాడా..?

 ప్రభాస్ ఆ స్టార్ హీరో మల్టీస్టారర్ సినిమా ఆఫర్ ని రిజెక్ట్ చేశాడా..?

బాహుబలి, కల్కి వంటి సినిమాలతో టాలీవుడ్ ని ప్రపంచానికి పరిచయం చేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దీంతో ప్రస్తుతం ప్రభాస్ కి భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా హిందీ, తమిళ్ తదితర సినీ పరిశ్రమలనుంచి దర్శక నిర్మాతలు ప్రభాస్ తో సినిమాలు తీసేందుకు మొగ్గు చూపుతున్నారు. 

అయితే బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తీస్తున్న మల్టీ స్టారర్ సినిమా ఆఫర్ ని ప్రభాస్ రిజెక్ట్ చేసినట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఈ మల్టీస్టారర్ సినిమాలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నటిస్తున్నాడు. దీంతో మరో హీరో కోసం ప్రభాస్ ని చిత్ర యూనిట్ సంప్రదించారట. కానీ ప్రభాస్ పాత్రకి ప్రాధాన్యత తకువగా ఉండటం, రన్ టైమ్ కూడా పెద్దగా లేకపోవడంతో సిద్ధార్థ్ ఆనంద్ సినిమా ని సున్నితంగా తిరస్కరించినట్లు బాలీవుడ్ సినీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

ALSO READ | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. విషెష్ చెప్పిన తారక్..

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజిబిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో ప్రముఖ డైరెక్టర్ మారుతి డైరెక్ట్ చేస్తున్న ది రాజా సాబ్, ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సలార్ 2, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2 చిత్రాల షూటింగులో పాల్గొంటున్నాడు. అయితే ది రాజా సాబ్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుండగా  వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఇటీవలే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ది రాజా సాబ్ మూవీ గ్లింప్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.