![డార్లింగ్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశ తప్పదా... రాజాసాబ్ రిలీజ్ వాయిదా పడనుందా..?](https://static.v6velugu.com/uploads/2025/02/is-prabhas-the-raja-saab-release-postponed-to-dussehra_Of78xREpVM.jpg)
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మారుతి దాసరి డైరెక్షన్ లో వస్తున్న "ది రాజాసాబ్" సినిమా కోసం డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రొమాంటిక్ కామెడీ హర్రర్ యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా నిధి అగర్వాల్, మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ నటిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి దాదాపుగా రెండేళ్లు కావస్తున్నపటికీ రిలీజ్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తున్నారు.
ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి షూటింగ్ పనులు పూర్తి కాకపోవడంతో ఏప్రల్ లో రాజాసాబ్ సినిమా రిలీజ్ అనుమానమేనని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన పలు VFX తోపాటూ ఎడిటింగ్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ దసరాకి వాయిదా పడనుందని టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం.
ALSO READ | Thandel Business: నాగచైతన్య తండేల్ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇన్ని వందల కోట్లా!
అయితే సౌత్ లో ఈ మధ్య రిలీజ్ అయిన హర్రర్ కామెడీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతోపాటూ రూ.వందల కోట్లు కలెక్షన్స్ సాధించాయి. దీంతో డైరెక్టర్ మారుతి మంచి క్వాలిటీ అవుట్ పుట్ కోసం కొంత ఎక్స్ట్రా సమయం తీసుకుంటున్నాడు. అందుకే సినిమా షూటింగ్ పూర్తవడం లేట్ అవుతోంది. అయితే రాజాసాబ్ రిలీజ్ వాయిదా పడినట్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం నిరాశకి గురవుతున్నారు. ప్రభాస్ నటించిన కల్కి సినిమా గత ఏడాది రిలీజ్ అయింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ లో వస్తుందనుకున్న రాజాసాబ్ గత ఏడాది నుంచి పోస్ట్ పోన్ అవుతూనే వస్తోంది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898AD పార్ట్ 2, సలార్ 2, స్పిరిట్, తదితర సినిమా షూటింగులతో బిజీగా ఉంటున్నాడు. ఇందులో ఇప్పటికే సలార్ 2 దాదాపుగా 60% శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. కల్కి 2 షూటింగ్ ఈ ఏడాది చివరిలో మొదలు కానుంది. ఇక స్పిరిట్ కోసం స్పిరిట్ కోసం కేవలం 90 రోజులు మాత్రమే కాల్షీట్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ముంబై లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నాడు.