ప్రభాస్ సినిమాకు టైటిల్ ఇదేనా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై డైరెక్టర్ రాధాకృష్ణ ఓ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు “రాధేశ్యామ్” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా యూనిట్ నుంచి దీనికి సంబంధించిన  అఫీషియల్ అనౌన్స్ రానుందని ఫిలీంనగర్ టాక్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూరప్ లో జరుగుతుండగా.. 30 రోజుల పాటు అక్కడే షూటింగ్  ఉంటుందని తెలిపింది యూనిట్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన    పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం నుంచే భారీ అంచనాలను పెట్టుకున్న ఫ్యాన్స్.. “రాధేశ్యామ్” టైటిల్ అదిరిందంటున్నారు.

See Also: తెలుగులోనూ కరోనా కాలర్ ట్యూన్