SSMB28 Updates: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని జక్కన్న రాజమౌళి SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ని గ్లోబల్ వైడ్ రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.
బాహుబలితో రికార్డులు బద్దలు కొట్టడమే కాకుండా ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా సినిమా స్ట్రాటజీస్ ని మార్చేశాడు. అయితే ఈసారి SSMB29తో హాలీవుడ్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. దీంతో మేకింగ్, క్యాస్ట్ & క్రూ విషయంలో కూడా అస్సలు తగ్గడం లేదు. ఈ క్రమంలో బాలీవుడ్, హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ దింపతున్నాడు. అలాగే బడ్జెట్ కూడా దాదాపుగా రూ.1200 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం.
అయితే ఎస్ఎస్ఎమ్బి29లో మహేష్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ని సెలెక్ట్ కేహసినట్లు సమాచారం. ప్రియాంక చోప్రాకి హాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే లవ్ ఎగైన్, ది సిటాడెల్, బే వాచ్, క్వాంటికో, ది స్కై ఈజ్ పింక్, వి కెన్ బీ హీరోస్, తదితర సినిమాలతో బాగానే ఆకట్టుకుంది. దీంతో రాజమౌళి ప్రియాంక చోప్రా ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం.
ఇప్పటికే రాజమౌళి అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ లో గ్లోబ్-ట్రాటింగ్ యాక్షన్-అడ్వెంచర్ సెట్స్ వేశారని దీంతో వచ్చే ఏడాది జనవరి నెలలో SSMB29 షూటింగ్ ప్రారంభవుతుంది. అయితే ఈ సినిమాని గ్లోబల్ వైడ్ రిలీజ్ చేస్తుండటంతో దాదాపుగా రూ.3000 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో SSMB29 సినిమాపై తీవ్ర ఆసక్తి నెలకొంది.