రాహుల్ గాంధీ పొత్తుల్లో చిత్తయ్యారా..?

పాత మిత్రులతో మరోసారి పొత్తులు పెట్టుకుంటూ కొత్త మిత్రుల కోసం వెతుకుతూ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి లోక్ సభ ఎన్నికల యుద్ధా నికి సిద్ధమవుతుంటే కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమి మాత్రం ఈ విషయంలో వెనకబడిపోతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి . ఎన్నికల పొత్తులు కుదుర్చుకోవడానికి చాలా నేర్పు, ఓపిక ఉండాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి తో వ్యవహరిం చాలి. మిత్రపక్షాలతో సర్దుబాటు ధోరణితో పనిచేయాలి. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఈ జాగ్రత్తల విషయంలో వెనకబడ్డారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇది సంకీర్ణాల యుగం. ఎన్నికల్లో జరిగే 543 నియోజకవర్గా ల్లో 185 సెగ్మెంట్లలో గెలుపో టమును నిర్ణయించేది ప్రాంతీయపార్టీలే.  జాతీయ పార్టీల ప్రభావం ఇక్కడ నామమాత్రమే. ప్రాంతీ య దళపతుల అండలేనిదే జాతీయ పార్టీలు చేసేది ఏమీ ఉండదిక్కడ. దీంతో మిత్రపక్షాల్లో పెద్ద పార్టీలు పెట్టు కునే పొత్తు లే కీలకం కానున్నాయి. పొత్తు ల విషయంలో చిన్న పార్టీలకంటే పెద్ద పార్టీలే ఎక్కువ సంయమనంతో ప్రవర్తిం చాల్సి ఉంటుం ది. ఒక్కోసారి పెద్ద పార్టీకి ఇష్టం లేకపోయినా చిన్న పార్టీల డిమాండ్లకు ఓకే చెప్పాల్సి ఉంటుం ది.పరస్పర ఆమోదయోగ్యం గా పొత్తులుండాలి. ముఖ్యం గా ఓ కూటమికి నాయకత్వం వహించే వ్యక్తికి రాజకీయ పరిపక్వత, గట్టి నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం చాలా అవసరం. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఈ విషయంలో వెనకబడ్డారంటున్నా రు రాజకీయ విశ్లేషకులు.

హర్యానా సంగతేంటి ?

పది లోక్ సభ నియోజకవర్గా లున్న హర్యానాలో కూడా ఆప్ తో పొత్తు విషయమై కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయింది. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) తో కలిసి నడవడానికి కేజ్రీవాల్ గతంలో ముందుకు వచ్చారు. ఈ మూడు పార్టీలు ఓ కూటమిగా కలిసి పోటీ చేయాలన్న ప్రపోజల్ ను రాహుల్ ముందు పెట్టారు కేజ్రీవాల్. అయితే కేజ్రీవాల్ ప్రపోజల్ పై కాంగ్రెస్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హర్యానాపై కేజ్రీవాల్ కు ప్రత్యేక ఆసక్తి ఉంది. ఢిల్లీ ఆప్ లో చక్రం తిప్పే చాలా మంది లీడర్ల మూలాలు హర్యానాలోనే ఉన్నాయి. ఆప్ కు అక్కడ అంతో ఇంత బలం ఉంది. మంచి కేడర్ ఉంది.

కర్ణాటకలోనూ లుకలుకలు

కర్ణాటకలోనూ పొత్తు ల విషయంలో కాంగ్రెస్ చాలా తర్జనభర్జనలు పడింది. దాదాపు వారం కిందట మాజీ ప్రధాని దేవె గౌడ్ నాయకత్వంలోని జేడీ(ఎస్) తో కాంగ్రెస్ పొత్తు ఖరారు చేసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో జేడీ (ఎస్) తో కలిసి నడవడానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఇష్టపడలేదు. సీట్ల పంపకం దగ్గర కూడా రెం డు పార్టీల మధ్య పేచీ వచ్చింది. చివరకు జేడీ(ఎస్) కు ఎనిమిది సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ హై కమాండ్ అంగీకరించడంతో రెండు పార్టీల మధ్య పొత్తు ఓ కొలిక్కి వచ్చింది.

బీహార్ లో ఆర్జేడీతో సీట్ల సంఖ్యపై పేచీ

బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పొత్తు కుదుర్చుకున్నా అక్కడ కూడా పరిస్థితులు గందరగోళంగానే ఉన్నట్లు కనిపిస్తున్నా యి. సర్దుబాటు లో భాగంగా కాంగ్రెస్ 11 సీట్లలోనూ, ఆర్జేడీ 20 సీట్లలోనూ పోటీ చేయడానికి రెండు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి. సీట్ల సంఖ్య దగ్గర కాంగ్రెస్ పార్టీ సంయమనంతో వ్యవహరించలేదని ఆర్జేడీ అసంతృప్తి తో ఉన్నట్లు పాట్నా పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. పొత్తు ల విషయంలో మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ పరిస్థితి అంత ఆశాజనకంగా ఉన్నట్లు కనిపించడం లేదు. పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాధాకృష్ణ విఖే పాటిల్ కుమారుడు సుజయ్ విఖే పాటిల్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. మిత్రపక్షాలతో సీట్ల పంపకాల్లో భాగంగా అహ్మద్ నగర్ నియోజకవర్గా న్ని ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ’ (ఎన్సీపీ) కి ఇవ్వడం పై తీవ్ర అసంతృప్తి తోనే సుజయ్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి నట్లు రాజకీయ వర్గా ల కథనం. అహ్మద్ నగర్ నియోజకవర్గం లో పాటిల్ కుటుంబాని కి మంచి పట్టుం ది. సుజయ్ పార్టీ నుంచి వెళ్లిపోయిన ప్రభావం అహ్మద్ నగర్ తో పాటు చుట్టు పక్కల ఉన్న మిగతా సెగ్మెంట్ల పై కూడా పడే అవకాశాలు ఉన్నా యంటున్నా రు రాజకీయ విశ్లేషకులు. ఇక ఎన్సీపీ విషయానికొ స్తే కాంగ్రెస్ తో పొత్తు పెట్టు కున్నా శరద్ పవార్ అంత హ్యాపీగా లేరన్న వార్తలు ముంబై పొలిటికల్ సర్కిల్స్​లో వినపడుతున్నాయి. నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అవుతారా, కారా అనే విషయాన్ని పక్కన పెడితే ఎన్నికల తర్వా త బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని పవార్ ఈమధ్య జోస్యం కూడా చెప్పారు. పరోక్షంగా యూపీఏ కూటమి విజయావకాశాలపై అనుమానాలు వ్యక్తం చేశారు.

యూపీలో కాంగ్రెస్ ది విచిత్రమైన పరిస్థితి

ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ది విచిత్రమైన పరిస్థితి. బీజేపీ పై యుద్ధం చేస్తు న్న మిగతా ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని పోలేని గమ్మత్తయిన పరిస్థితి. మోడీ సర్కార్ పై సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ కూడా మొదటి నుంచి యుద్ధం చేస్తున్నాయి. అయితే జాతీయ స్థాయిలో ఎన్డీయే పై సమరం చేస్తు న్న కాంగ్రెస్ ను ఈ రెం డు పార్టీలు దూరంగా ఉంచాయి. అమేథి, రాయ్ బరేలి రెండు లోక్ సభ సెగ్మెంట్లను కాంగ్రెస్ కు వదిలేశాయి తప్ప ఆ పార్టీతో పొత్తు పెట్టు కోలేదు. దీని కి ఎస్పీ సీనియర్ నేత అఖిలేశ్ యాదవ్ కారణం కూడా వెల్లడించారు. “కాంగ్రెస్ కు బీజేపీని ఓడించడం కంటే తమ పార్టీని బలోపేతం చేసుకోవడమే ముఖ్యమని ” వివరణ ఇచ్చారు. మూడు హిందీ రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ లో కొన్ని నెలల కిందట అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మాయావతి ఆధ్వర్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ తో పొత్తు పెట్టు కోవడానికి కాంగ్రెస్ ఏమాత్రం ఉత్సాహం చూపలేదు. దీనికి మాయావతి తీవ్రంగా రియాక్టయ్యా రు. దీంతో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ తో పొత్తు అనేదే ఉండదని తెగేసి చెప్పారు.

మాయావతి మరో విషయం కూడా చెప్పారు. ఒకవేళ పొత్తు ఉంటే తమ పార్టీ ఓట్లు కాంగ్రెస్ కు పడతాయి కానీ సంప్రదాయంగా కాంగ్రెస్ కు పడే ఓట్లు తమ పార్టీకి ట్రాన్స్ ఫర్ అవుతాయన్న నమ్మకం లేదన్నా రు. దీంతో యూపీలో బీజేపీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్న విషయం రాహుల్ కు అర్థమైం ది. ఈ నేపథ్యం లో సోదరి ప్రియాంక కు నచ్చ చెప్పి ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చారు. యూపీ తూర్పు ప్రాంత బాధ్యతలు ఆమెకు అప్పగించారు.