ఆ సూపర్ హిట్ చిత్రంలో విలన్ చేంజ్ అయ్యాడా..?

ఆ సూపర్ హిట్ చిత్రంలో విలన్ చేంజ్ అయ్యాడా..?

బాలీవుడ్ లో ప్రముఖ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటించిన ధూమ్ సీరీస్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ క్రమంలో ఈ యాక్షన్ సినిమాలకి రానురాను క్రేజ్ పెరుగుతోంది. దీంతో మేకర్స్ కూడా బడ్జెట్ అలాగే క్యాస్ట్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ధూమ్ 3 చిత్రాన్ని రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా దాదాపుగా రూ.175 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ హీరో హృతిక్ రోషన్ కి బదులుగా అమీర్ ఖాన్ నటించాడు.

దీంతో ధూమ్ 4 చిత్రంపై ఆసక్తి నెలకొంది. అలాగే ధూమ్ 4 చిత్రంలో విలన్ ఎవరనే విషయంపై రోజుకో పేరు వినిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా ఇప్పటికే ఈ చిత్రంలో హృతిక్ కి విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్నాడని , కానీ అనుకోని కారణాలవల్ల సూర్య ధూమ్ 4 చిత్రం నుంచి తప్పుకున్నాడని పలు వార్తలు నెట్టింట బలంగా వినిపిస్తున్నాయి. దీంతో సూర్య స్థానంలో మరో బాలీవుడ్ ప్రముఖ హీరో అయిన రణబీర్ కపూర్ ని తీసుకున్నట్లు సమాచారం. కాగా ఇప్పటివరకూ క్లాస్ హీరోగా అలాగే లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న రణబీర్ కపూర్ విలన్ రోల్ లో ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.

ALSO READ : అబుదాబిలో ఐఫా అవార్డుల వేడుక

ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్ హీరోగా నటించాడు. ఈ చిత్రం ప్యాన్ ఇండియా భాషలలో విడుదల చేసారు. అయితే యానిమల్ చిత్రం దాదాపుగా రూ.900 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. ప్రస్తుతం రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర 2, యానిమల్ 2, రామాయణం తదితర చిత్రాల షూటింగులతో బిజీబిజీగా ఉన్నాడు.