చిరు కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని దింపుతున్న శ్రీకాంత్ ఓదెల... ఎవరంటే.?

చిరు కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని దింపుతున్న శ్రీకాంత్ ఓదెల... ఎవరంటే.?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాని యాక్షన్ ఎంటర్ టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తుండగా టాలీవుడ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ హీరో నాని సమర్పణలో ఎస్ఎల్వి సినిమాస్, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది.

అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరుకి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ ని తీసుకొస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాణి ముఖర్జీని చిత్ర యూనిట్ సంప్రదించి స్టోరీ కూడా వినిపించారట... మెగాస్టార్ తో సినిమా కావడంతో మారు మాట్లాడకుండా రాణి ముఖర్జీ వెంటనే ఒప్పుకుందని అంతేకాకుండా డేట్లు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఈ విషయం ఇలా ఉండగా శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా "దసరా" బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో హీరో నాని ఏకంగా మళ్ళీ రెండో ఛాన్స్ కూడా ఇచ్చాడు. అంతేకాదు మంచి స్టోరీ, శ్రీకాంత్ స్కిల్స్ ని నమ్మి ఏకంగా చిరంజీవి సినిమాని రూ.175 కోట్లు బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు హీరో నాని. ప్రస్తుతం చిరు "విశ్వంభర" సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చివరి షెడ్యూల్ మార్చ్ నెలలో పూర్తవుతుంది. ఆ తర్వాత చిరు తన తదుపరి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటాడు.