బాలయ్య తనయుడికి జోడీగా సీనియర్ హీరోయిన్ డాటర్.. నిజమేనా..?

బాలయ్య తనయుడికి జోడీగా సీనియర్ హీరోయిన్ డాటర్.. నిజమేనా..?

టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నాడు. మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ పవర్ ఫుల్ యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథని సిద్దం చేసినట్లు తెలుస్తోంది. 

అయితే ఈ సినిమా కి అంతా సిద్దం అయినప్పటికీ మోక్షజ్ఞ సరసన నటించే హీరోయిన్ ఎవరనే విషయంలో రోజుకో వార్త సోషల్ మీడియాలో విన్పిస్తోంది. ఇందులో ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోయిన్ కూతురు రషా తడాని నటించబోతోందని కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

ALSO READ | సంక్రాంతి బరిలో నాగచైతన్య తండేల్.. నిజమేనా..?

అంతేగాకుండా ఇప్పటికే రషా తడాని ప్రశాంత్ వర్మ సినిమా కోసం ఆడిషన్స్ కూడా ఇచ్చిందని దీంతో త్వరలోనే చిత్ర యూనిట్ తో షూటింగ్ లో జాయిన్ కాబోతోందని బాలయ్య అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

గతంలో మోక్షజ్ఞ సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని పలు వార్తలు బలంగా వినివపించాయి. కానీ ఇప్పటివరకూ చిత్ర యూనిట్ మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు.