జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి పాత్రని ఆ హీరో రిజెక్ట్ చేశాడా.?

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కన్నడలో కాంతార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని నిర్మిస్తున్నాడు. ఇటీవలే జై హనుమాన్ సినిమాకి సంబంధించన థీమ్ సాంగ్, టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

అయితే జై హనుమాన్ సినిమాకి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే జై హనుమాన్ సినిమాలోని హనుమాన్ పాత్రకి మొదటగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ ని సంప్రదించాడట. కానీ అప్పటికే సన్నీ డియోల్ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రామాయణం సినిమాలో హనుమాన్ పాత్రకి ఒకే చెప్పడంతో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కి నో చెప్పాడని టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

అయితే సన్నీ డియోల్ తర్వాత పలువురి కోలీవుడ్ హీరోలకి కథ వినిపించినప్పటికీ పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో చివరికి జై హనుమాన్ ఆఫర్ రిషబ్ శెట్టి ని వరించినట్లు సమాచారం. దీంతో రిషబ్ శెట్టి పాత్రకి తగ్గట్టుగా బాడీ ని బిల్డ్ చేసుకోవడంకోసం ప్రత్యేక ఆహార డైట్,  జిమ్ వర్కౌవట్లు చేసి కష్టపడ్డాడు. ఏదేమైనప్పటికీ జై హనుమాన్ లో రిషబ్ శెట్టి లుక్ చుసిన ఫ్యాన్స్ మాత్రం ఫుల్ సాటిస్ఫై అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.