Rohit Sharma-Ritika Sajdeh: జూ. హిట్ మ్యాన్ కమింగ్.. తండ్రి కాబోతున్న రోహిత్ శర్మ!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ రెండోసారి తండ్రి కాబోతున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. అతని భార్య రితికా సజ్దే ఇటీవలే జరిగిన సియట్ అవార్డుల ఫంక్షన్ లో బేబీ బంప్‍తో దర్శనమిచ్చింది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్స్ జూనియర్ హిట్ మ్యాన్ త్వరలో వస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. 

రోహిత్ శర్మ, రితికలు జూన్ 3, 2015న నిశ్చితార్థం చేసుకున్నారు. 2015 డిసెంబర్ 13 న వీరి వివాహం ముంబైలోని తాజ్ ల్యాండ్స్ హోటల్‌లో గ్రాండ్ గా వారి వివాహం జరిగింది. ఈ దంపతులకు 2018 డిసెంబర్ 30 న కూతురు పుట్టింది. ఈ చిన్నారికి వారు సమైరా అనే పేరు పెట్టారు. మళ్ళీ ఆరేళ్ళ తర్వాత రోహిత్ శర్మ మరోసారి తండ్రి కాబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. 

Also Read:-డ్రీమ్ 11 డేటా సోర్స్ హ్యాకర్ అరెస్ట్

 

ప్రస్తుతం రోహిత్ శర్మ ఖాళీగా ఉన్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత దాదాపు ఆరు వారల పాటు రెస్ట్ లభించింది.ఈ సిరీస్ లో హిట్ మ్యాన్ అద్భుత ప్రదర్శన చేసినా భారత్ 0-2 తేడాతో ఓడిపోయింది. ఇటీవలే సియట్ అవార్డుల ఫంక్షన్ లో మాట్లాడుతూ సందడి చేశాడు. దులీప్ ట్రోఫీ నుంచి రెస్ట్ తీసుకున్న రోహిత్.. స్వదేశంలో సెప్టెంబర్ 19 నుంచి జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కు అందుబాటులో ఉండనున్నాడు.