ఈ సోషల్ మీడియా ఉందే.. నిజం ఏంటీ.. అబద్ధం ఏంటీ అనేది కూడా తెలుసుకోకుండా.. ఏది పడితే అది వైరల్ చేసేస్తుంది.. అలాంటిదే ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అది కూడా 500 రూపాయల నోట్లపై జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత.. అలాంటి నోట్లు ఒరిజినలా లేక నకిలీనా అనేది డీటెయిల్డ్ గా తెలుసుకుందాం...
ప్రచారం ఏంటీ.. :
మార్కెట్ లో కొన్ని 500 రూపాయల నోట్లపై ఉండే సీరియల్ నెంబర్స్ మధ్యన స్టార్ గుర్తు (నక్షత్రం) ఉన్న నోట్లు నకిలీవి అంటూ తెగ ప్రచారం జరుగుతుంది. ప్రతి 500 రూపాయల నోటుపై సహజంగానే ఓ సిరీస్ నెంబర్ ఉంటుంది.. ఆ నెంబర్ల మధ్య ఉన్న స్టార్ (నక్షత్రం) గుర్తు ఉండే నోట్లు నకిలీవి అని.. వాటిని ఎవరూ తీసుకోవద్దు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో మార్కెట్ లో చాలా మంది 500 రూపాయల నోట్లపై ఉండే సిరీస్ నెంబర్ల మధ్య స్టార్ గుర్తు ఉన్న నోట్లు తీసుకోవటం లేదు.. ఇది ప్రచారం..
వాస్తవం ఏంటీ అంటే :
500 రూపాయల నోటుపై ఉండే సిరీస్ నెంబర్ మధ్య స్టార్ గుర్తు ఉన్న నోట్లు ఒరిజినల్.. వీటిని రిజర్వ్ బ్యాంక్ ఇండియానే రిలీజ్ చేసింది. 2016, నవంబర్ 8వ తేదీన ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటనలో ఇది స్పష్టంగా ఉంది. సిరీస్ నెంబర్ మధ్య స్టార్ గుర్తుతో ఉన్న 500 రూపాయల నోట్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది ఆ ప్రకటన. ఫస్ట్ టైం 2016లోనే ఇలాంటి గుర్తుతో నోట్లను విడుదల చేశారు. ఒక్క 500 రూపాయల నోట్లపైనే కాదు.. 10, 20, 50, 100 రూపాయల నోట్లపైనా అప్పట్లో స్టార్ గుర్తును ముద్రించింది రిజర్వ్ బ్యాంక్ ఇండియా. సో.. 500 నోట్లపై స్టార్ గుర్తు ఉంటే.. ఆ నోటు ఒరిజినల్.. నకిలీ కాదు.
ALSO READ :భారత్ లో పేదరికంపై ఎన్సీఏఈఆర్ నివేదిక
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఇది. డోంట్ వర్రీ.. మీ దగ్గర ఉన్న 500 రూపాయల నోట్లపై స్టార్ గుర్తు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు.. అది ఒరిజినల్.