ఎన్టీఆర్-నీల్ సినిమాలో కన్నడ హీరోయిన్.. నిజమేనా..?

ఎన్టీఆర్-నీల్ సినిమాలో కన్నడ హీరోయిన్.. నిజమేనా..?

టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో ఎన్టీఆర్ కన్నడ స్టార్ హీరో ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇటీవలే ఎన్టీఆర్ దేవర చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ప్రశాంత్ నీల్ సినిమాపై దృష్టి సారించాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

ఈ క్రమంలో ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా కన్నడ యంగ్ బ్యూటీఫుల్ హీరోయిన్ రుక్మిణీ వసంత్ ని తీసుకోవాలనుకుంటున్నట్లు టాలీవుడ్ లో టాక్ విన్పిస్తోంది. అయితే రుక్మిణీ వసంత్ కి కన్నడలో మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ బ్యూటీ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. కానీ ఈ వార్తలో నిజమెంతుందనేది తెలియాలి.

ALSO READ | Tollywood Movies: దీపావళి స్పెషల్.. టాలీవుడ్ కొత్త సినిమాల పోస్టర్స్ రిలీజ్

అయితే రుక్మిణీ వసంత్ ప్రస్తుతం కన్నడలో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగులో ప్రముఖ హీరో నిఖిల్ హీరోగా నటిస్తున్న "అప్పుడో ఇప్పుడో ఎప్పుడో" అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయితే గతంలో సుధీర్ వర్మ-నిఖిల్ కాంబనేషన్ లో వచ్చిన స్వామి రారా, కేశవ చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.