పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో సాహో బ్యూటీ..?

పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో సాహో బ్యూటీ..?

టాలీవుడ్ ప్రముఖ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప : 2 ది రూల్ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక  మందాన నటిస్తుండగా మలయాళీ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, ధనుంజయ్, ప్రముఖ యాంకర్ అనసూయ, అజయ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్, అమ్మ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.  అలాగే రూ.370 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది.  

అయితే పుష్ప మొదటి భాగంలో టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ సాంగ్ సినిమా రిజల్ట్స్ పై ప్రభావం చూపిందని చెప్పవచ్చు. దీంతో పుష్ప సెకెండ్ పార్ట్ లోని స్పెషల్ సాంగ్ పై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శ్రద్దా కపూర్ పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 
దీంతో ఈ వార్త నిజమయితే హిందీలో పుష్ప 2 కి మంచి హైప్ వస్తుందని అలాగే కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ విషయంలో కొంతమేర సస్పెన్స్ నెలకొంది. కాగా గతంలో కూడా ప్రముఖ మోడల్ మరియు బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెల ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటిస్తుందని గతంలో పలు గాసిప్స్ వినిపించాయి. కానీ చిత్ర యూనిట్ కొట్టిపారేశారు. అయితే పుష్ప : 2 ది రూల్ డిసెంబర్ 06న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ కి ముందే పుష్ప 2 చిత్రం దాదాపుగా రూ.650 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.