Sai Pallavi: ఎల్లమ్మ టీమ్ కి బ్యాడ్ న్యూస్ చెప్పిన సాయి పల్లవి.. చివరి నిమిషంలో అలా అనేసిందా..?

Sai Pallavi: ఎల్లమ్మ టీమ్ కి బ్యాడ్ న్యూస్ చెప్పిన సాయి పల్లవి.. చివరి నిమిషంలో అలా అనేసిందా..?

జబర్దస్త్ షోలో కమెడియన్ గా అలరించిన ప్రముఖ కమెడియన్ వేణు.. మెగా ఫోన్ పట్టి బలగం సినిమా తీసి మంచి ఫ్యామిలీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా దర్శకుడు వేణు కెరీర్ ని ఒక్కసారిగా టర్న్ చేసిందని చెప్పవచ్చు. అయితే బలగం సినిమా తర్వాత వేణు ఎల్లమ్మ అనే మరో విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో ప్రొడ్యూసర్, హీరో, స్టోరీ ఇలా అన్నీ రెడీగా ఉన్నాయి. దీంతో త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది.,. కానీ చివరి నిమిషంలో హీరోయిన్ విషయంలో బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. 

అయితే ఈ సినిమాలో హీరోగా యంగ్ హీరో నితిన్ కన్ఫర్మ్ కాగా హీరోయిన్ గా మలయాళ బ్యూటిఫుల్ హీరోయిన్ సాయి పల్లవి ని సెలెక్ట్ చేశారు.. ఇక్కడివరకూ అంతాబాగానే ఉంది.. కానీ లాస్ట్ మినిట్ లో సాయి పల్లవి ఎల్లమ్మ చిత్ర యూనిట్ కి ట్విస్ట్ ఇచ్చినట్లు సమాచారం.  సాయిపల్లవి ప్రస్తుతం వరుస సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో కాల్షీట్ల డేట్లు కుదరకపోవడంతో ఎల్లమ్మ సినిమా నుంచి తప్పుకుందని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఎల్లమ్మ టీమ్ ఫీమేల్ లీడ్ కోసం మళ్ళీ ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎల్లమ్మ సినిమా నుంచి సాయి పల్లవి తప్పుకున్నట్లు వినిపిస్తున్న వార్తలపై చిత్ర యూనిట్ స్పందించకోపోవడం గమనార్హం.. 

ALSO READ | మహేష్, సితారా కొత్త యాడ్ అదుర్స్.. అన్నాచెల్లెలిలా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్

ఈ విషయం ఇలా ఉండగా నటి సాయి పల్లవి గత ఏడాది కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్  హీరోగా నటించిన "అమరన్" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఏడాది టాలీవుడ్ లో ప్రముఖ హీరో అక్కినేని నాగ చైతన్య నటించిన "తండేల్" సినిమాతో మంచి క్లాసికల్ హిట్ అందుకుంది. ప్రస్తుతం హిందీలో రామాయణ, ఏక్ దిన్ తదితర సినిమాల్లో నటిస్తోంది. ఇందులో రామాయణ పార్ట్ 1 సినిమా సైలెంట్ గా ముంబైలో జరుగుతోంది. ఈ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది.