
టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఐతే రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన మూవీ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న RC16(వర్కింగ్ టైటిల్) లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ని బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం RC16 హైదరాబాద్ పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది..
అయితే ఆమధ్య రామ్ చరణ్ మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. అయితే రామ్ చరణ్ RC16తో బిజీగా ఉన్నప్పటికి సుకుమార్ మాత్రం సైలెంట్ గా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతని సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
ALSO READ | రాజమౌళి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఇదే.. !
గతంలో రామ్ చరణ్, సమంత, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం బ్లాక్ బాసటర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో సమంత అచ్చమైన పల్లెటూరి యువతి పాత్రలో నటించి ఆకట్టుకుంది. దీంతో మరోసారి సమంత ని రిపీట్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే సమంతకి స్క్రిప్ట్ వినిపించగా వెంటనే ఒకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది..
ఈ విషయం ఇలా ఉండగా డైరెక్టర్ సుకుమార్ గత ఏడాది చివరిలో వచ్చిన పుష్ప 2: ది రూల్ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం సుకుమార్ దాదాపుగా 5 ఏళ్లపాటు పని చేశాడు. చివరికి సాలీడ్ హిట్ అందుకున్నాడు.. దీంతో రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచినట్లు తెలుస్తోంది.