Samantha: స్టార్ డైరెక్టర్ తో నటి సమంత డేటింగ్..? చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోస్ వైరల్..

Samantha: స్టార్ డైరెక్టర్ తో నటి సమంత డేటింగ్..? చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోస్ వైరల్..

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత డేటింగ్ వ్యవహారానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. అయితే శనివారం నటి సమంత తన అధికారిక ఇన్స్టాగ్రామ్ లో పికిల్‌బాల్ టోర్నమెంట్‌ కి సంబందించిన ఫోటోలు షేర్ చేసింది. ఇందులో పికిల్‌బాల్ ప్లేయర్స్ తో కలసి సరదాగా గడిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫొటోలలో సిటాడెల్: హనీ బన్నీ దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా కనిపించాడు.

ముఖ్యంగా దర్శకుడు రాజ్ నిడిమోరు చెయ్యి పట్టుకుని సమంత కనిపించడంతో ఒక్కసారిగా వీరిద్దరిమధ్య ప్రేమ, డేటింగ్ వంటివి ఉన్నాయంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు ఏకంగా సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సీరీస్ షూటింగ్ సమయంలో సమంత డైరెక్టర్ రాజ్ తో ప్రేమలో పడిందని త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ప్రచారాలు చేస్తున్నారు. నటి సమంత  ఈ ప్రేమ, డేటింగ్ వ్యవహారంపై స్పందించడం లేదు. కానీ కొందరు సమంత ఫ్యాన్స్ మాత్రం ఈ రూమర్స్ ని ఖండిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు కలసి ఒకే ఫొటోలో కనిపించినంత మాత్రాన వారిమధ్య ఏదో ఉందంటూ నిజానిజాలు తెలుసుకోకుండా  వార్తలు ప్రచారం చెయ్యడం సరికాదని సీరియస్ అవుతున్నారు.

ALSO READ | తెలుగులో మరో స్ట్రెయిట్ సినిమా మొదలుపెట్టిన దుల్కర్..

ఈ విషయం ఇలా ఉండగా నటి సమంత 2017లో టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగ చైతన్య ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ 5 ఏళ్లపాటు కలసి ఉన్నారు. కానీ అనుకోని కారణాలవల్ల పరస్పర అంగీకారంతో 2021వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. అయితే ఈ విడాకుల తర్వాత అక్కనేని నాగచైతన్య గత్ ఏడాది డిసెంబర్ లో తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ సమంత మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోలేదు. దీంతో ప్రస్తుతం సమంత ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క బిజినెస్ లో కూడా పెట్టుబడులు అంటూ బిజిబిజీగా గడుపుతోంది.