మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాని రామ్ చరణ్ చేస్తున్నాడా..?

మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాని రామ్ చరణ్ చేస్తున్నాడా..?

టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది ఆరంభంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా, ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత దిల్ రాజు నిర్మించాడు.. రామ్ చరణ్ కి జంటగా ప్రముఖ హీరోయిన్లు అంజలి, కియారా అద్వానీ నటించారు. దాదాపుగా రూ.450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని అలరించలేకపోయింది. దీంతో ఈసారి రామ్ చరణ్ మళ్ళీ సాలీడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. 

ఇందులోభాగంగా డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే సందీప్ రెడ్డి రామ్ చరణ్ కోసం పవర్ఫుల్ & యాక్షన్ జోనర్ లో మంచి స్టోరీ ని సిద్ధం చేస్తున్నాడని, ప్రస్తుతం ఈ స్టోరీ నేరేషన్ ఫైనల్ స్టేజీలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు గతంలో సందీప్ రెడ్డి మహేష్ కోసం రెడీ చేసిన డెవిల్ అనే సినిమా స్టోరీ ని రామ్ చరణ్ కి వినిపించాడని దీంతో స్టోరీ నచ్చడంతో రామ్ చరణ్ కూడా ఒకే చెప్పినట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి. 

ALSO READ | గౌరవంగా మరణించే హక్కు కల్పించిన ప్రభుత్వం.. ప్రశంసించిన వెటరన్ హీరోయిన్..

అయితే డెవిల్ స్క్రిప్ట్ లో రామ్ చరణ్ ఎలివేషన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని, ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకూ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్లు అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. మరి సందీప్ రెడ్డి, రామ్ చరణ్ ల కాంబినేషన్లో సినిమా వస్తుందని వినిపిస్తున్న వార్తలపై ఈ ఇద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ RC16 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి విషయానికొస్తే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా  షూటింగ్ ముంబైలో జరుగుతోంది. స్పిరిట్ లో ప్రభాస్ పవర్ఫుల్ కాప్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు సమాచారం.