అఖిల్ కోసం మళ్ళీ కొత్త ప్రయోగం చేస్తున్నారా..?

అఖిల్ కోసం మళ్ళీ కొత్త ప్రయోగం చేస్తున్నారా..?

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని అఖిల్ ప్రముఖ డైరెక్టర్ మురళీ కృష్ణ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ కి జంటగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. అన్నపూర్ణ స్త్యుడియోస్ నిర్మొస్తోంది. ఈ సినిమాని రాయలసీమ జిల్లాల్లో ఒకటైన అనంతపురం జిల్లాలోని ఓ పల్లెటూరులో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రతీక్ గాంధీ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా కథ వినిపించగా ప్రతీక్ గాంధీ వెంటనే ఒకే చెప్పినట్లు టాక్. అయితే ప్రతీక్ గాంధీ ఒకప్పటి స్టాక్ మార్కెట్ బిజినెస్ మెన్ హర్షద్ మెహతా బయోపిక్ స్కామ్ 1992 ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో కూడా నటించాడు. కానీ ఈ సినిమాలు పెద్దగా క్లిక్ కాలేదు.

Also Read : మరోసారి నాంపల్లి కోర్టుకి వెళ్లిన అల్లు అర్జున్

ఈ విషయం ఇలా ఉండగా గతంలో అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాని దాదాపుగా రూ.85 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ కనీసం రూ.10 కోట్లు కూడా కలెక్ట్ చెయ్యలేదు. దీంతో దర్శకనిర్మాతలకి భారీ నష్టాలు మూటగట్టుకున్నారు.