Sreeleela: స్టార్ హీరో కొడుకు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్... శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్..

Sreeleela: స్టార్ హీరో కొడుకు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్... శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్..

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్‌ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో హిందీలో స్త్రీ, భేడియా వంటి హిట్ చిత్రాలని నిర్మించిన ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దినేష్ విజన్ ఇబ్రహీం అలీఖాన్‌ లాంచింగ్ కి ఏర్పాట్లు చేస్తన్నాడు. అయితే ఇబ్రహీం అలీఖాన్‌ డెబ్యూ సినిమాలో హీరోయిన్ గా కన్నడ స్టార్ హీరోయిన్ శ్రీలీల ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయినట్లు సమాచారం.

ఇటీవల శ్రీలీల ఇబ్రహీం అలీఖాన్‌ తో కలసి మాడాక్ ఫిల్మ్స్ ఆఫీస్ దగ్గర కనిపించారు. ఈక్రమంలో కలసి ఫొటోలకి ఫోజులిస్తూ కిస్సిక్ సాంగ్  కి స్టెప్పులు కూడా వేశారు. దీంతో ప్రస్తుతం శ్రీలీల ఇబ్రహీం అలీఖాన్‌ జంట ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు శ్రీలీల మంచి టాలెంటెడ్ యాక్టర్ అని, కచ్చితంగా ఇబ్రహీం అలీఖాన్‌ కి హిట్ ఇస్తుందని కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ | SankranthikiVasthunam: రీల్స్తో ఉర్రూతలూగిస్తున్న వెంకీ మామ.. ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా రా కాస్త నవ్వండి

ఈ విషయం ఇలా ఉండగా నటి శ్రీలీల భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అయితే ఇటీవలే శ్రీలీల నటించిన కిస్సిక్ సాంగ్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యింది. ఇక శ్రీలీల హీరోయిన్ గా నటించిన రాబిన్ హుడ్ సినిమా షూటింగ్ పూర్తీ చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది.