![మంగళవారం 2లో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ.. పాయల్ ని అందుకే తొలగించారా.?](https://static.v6velugu.com/uploads/2025/02/is-sreeleela-playing-lead-role-in-mangalavaram-2_y1Ljiwbu67.jpg)
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన "మంగళవారం" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. దీంతో దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమా సీక్వెల్ తెరకేకించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. దీంతో త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది.
అయితే మంగళవారం సినిమాలో మెయిన్ లీడ్ పాత్రలో నటించిన పాయల్ రాజ్ పుత్ పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీలీల ని తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీలీల కి సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. అలాగే డ్యాన్స్, యాక్టింగ్ పరంగా శ్రీలీల తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. దీంతో అజయ్ భూపతి శ్రీలీల ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మంగళవారం సినిమా లో పాయల్ పాత్ర మరణించడంతో ఎక్స్టెండ్ చేయడానికి స్కోప్ లేదు. ఈ కారణంగానే పాయల్ రాజ్ పుత్ ని మంగళవారం 2 సినిమా నుంచి తప్పించినట్లు సమాచారం. ఏదేమనప్పటికీ శ్రీలీల మాత్రం వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.
ALSO READ | ఫొటోలు : మోదీతో నాగార్జున ఫ్యామిలీ : పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని
అయితే శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ మార్చ్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించగా, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుములు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా గత ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలవల్ల రిలీజ్ వాయిదా పడింది.