
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల ఈమధ్య బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈక్రమంలో ఇప్పటికే ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ బసూ డైరెక్ట్ చేస్తున్న "ఆషీకీ 3" లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే హిందీలో స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ "పతి పత్ని ఔర్ వో 2" సినీఅమ్మలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన లుక్ టెస్ట్ తోపాటూ స్టోరీ నేరేషన్ ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి.
అయితే చివరి నిమిషంలో మేకర్స్ శ్రీలీల స్థానంలో మరో యంగ్ హీరోయిన్ ని తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులోభాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా తడాని ని రీప్లేస్ చేసినట్లు తెలుస్తోంది. అయితే రాషా తడాని ఇటీవలే హిందీలో ఆజాద్ అనే సినిమాతో మంచి హిట్ అందుకుంది. అందుకే శ్రీలీల ప్లేస్ లో రాషా తడాని ని తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా జూన్ లేదా ఆగస్టు నెలలో సెట్స్ మీదకి వెళ్లనుంది. దీంతో కార్తీక్ ఆర్యన్ సరసన రొమాన్స్ చేసే బ్యూటీ ఎవరనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ విషయం ఇలా ఉండగా నటి నటి శ్రీలీల తాజాగా నటించిన రాబిన్ హుడ్ సినిమా శుక్రవారం (మార్చ్ 28) రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో శ్రీలీల ఎన్నారై యువతి పాత్రలో నటించింది. ఈ సినిమాకి భీష్మ మూవీ ఫేమ్ డైరెక్టర్ వెంకీ కుడుములు దర్శకత్వం వహించగా నితిన్ హీరోగా నటించాడు. ఇక శ్రీలీల రాబోయే సినిమాల గురించి చూసినట్లైయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్", మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న "మాస్ జాతర" సినిమాలతోపాటు హిందీ, తమిళ్, కన్నడ తదితర భాషల్లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.