కడుపు ఉబ్బరంగా అనిపించడం సాధారణం.పెద్దగా ఏమీ తినకపోయినా పొట్ట బెలూన్‌లా మారి కడుపు నిండిపోయినట్లుగా అనిపిస్తుంటుంది.కడుపు ఉబ్బినప్పుడు పొత్తికడుపు పరిమాణం పెరగడంతో కడుపు నిండుగా మారి ఇబ్బంది పెడుతుంది. దీనితో పాటు కడుపు నొప్పి, అసౌకర్యం, పొట్టలో శబ్దాలు వస్తుంటాయి. ఈ సమస్య రావడానికి కారణాలు, పరిష్కార మార్గాలు తెలుసుకుందాం.
కడుపు ఉబ్బరం సమస్యకు కారణాలు అనేక రకాలుగా ఉంటాయి.కొన్ని రకాల సంక్లిష్టమైన కారణాలతో కూడా పొట్ట ఉబ్బరం ఏర్పడవచ్చంటున్నారు డాక్టర్లు. రోగ నిరోధక వ్యవస్థలో సమస్యలు నుంచి ఒక రమైన క్యాన్సర్ సంకేతాల వరకు ఈ కారణాల్లో ఉండొచ్చంటున్నారు.
గ్యాస్
పొట్ట ఉబ్బరానికి అత్యంత సాధారణ కారణం పేగుల్లో గ్యాస్ నిండటం. కొన్ని రకాల ఆహార పదార్థాలు, డ్రింక్స్ లేదా తినేటప్పుడు గాలిని మింగడం వల్ల ఇలా పొట్ట ఉబ్బరం కలుగుతుందని నివేదికలు చెపుతున్నాయి.
మలబద్దకం మరో కారణం: మల విసర్జన చేయడానికి ఇబ్బందిపడుతున్నట్లయితే.. మలం గట్టిగా రాళ్ల మాదిరిగా ఉంటే మలవిసర్జన తర్వాత కూడా పొట్ట ఖాళీ అయిన భావన కలగకపోతే మీరు మలబద్ధకంతో బాధపడుతున్నట్లు అని డాక్టర్లు చెపుతున్నారు.
ఈ కారణాలన్న పొత్తికడుపు నొప్పికి , ఉబ్బరానికి దారి తీస్తుంది. ఎక్కువ కాలం మలం బయటికి రాకపోతే పొట్టలో బ్యాక్టీరియా పులియబెట్టే అవకాశాలు ఎక్కువ. ఫలితంగా పొట్టలో మరింత గ్యాస్ ఏర్పడుతుంది. దీంతో పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది.
పేగుల్లో కదలిక లేకపోవడం
కడుపు ఉబ్బరానికి మరో కారణం చిన్న పేగుల్లో బ్యాక్టీరియా అధికంగా పెరగడం. పెద్ద పేగు నుంచి అధిక మోతాదులో ఈ బ్యాక్టీరియా చిన్నపేగుల్లోకి చేరుతుంది. ఈ బ్యాక్టీరియా శరీర వ్యవస్థను సమతుల్యం చేసే వాయువులను పీల్చుకునే ఇతర బ్యాక్టీరియాపై పేరుకుపోతుంది. పొత్తికడుపు సర్జరీలో ఏదైనా సమస్య తర్వాత లేదా జీర్ణవ్యవస్థలో కొన్ని సమస్యల కారణంగా ఈ సమస్య ఏర్పడుతుందంటున్నారు డాక్టర్లు.
పడని ఆహారం తీసుకున్నపుడు ..
కొన్ని సార్లు మనకు పడని ఆహారం తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. కార్బొనేటెడ్ డ్రింకులు, జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకునే ఆహార పదార్థాల వల్ల ఈ పరిస్థితి తెలెత్తుందట. లాక్టోజ్, ప్రక్టోజ్ లతోపాటు కార్బోహైడ్రేట్లు ఉండే గోధుమలు, చిక్కుళ్లు వంటివి కూడా కడుపు ఉబ్బరానికి దారి తీస్తాయట.
కడుపు ఉబ్బరానికి నివారణ మార్గం..
జీవక్రియను మెరుగుపర్చడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పొట్టలో ఉన్న గ్యాస్ ను బయటికి పంపేందుకు పొట్టపై కుడివైపు నుంచి ఎడమ వైపు మసాజ్ చేయాలని నిపుణులు అంటున్నారు.
మలబద్దకం ఉంటే పీచు పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగడం మంచిది కార్బోనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్, కెఫిన్ అధికంగా ఉండే కాఫీ, టీ, కొవ్వు పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఎక్కువ మోతాదులో చక్కెరలు ఉండే ఆహారాలు, మసాలా పదార్థాలను మానేయాలి. వాత గుణం ఎక్కువగా ఉండే క్యాబేజీ, బీన్స్, లెంటిల్స్‌కు దూరంగా ఉండాలి.
తినేవిధానంలో కొంచెం మార్పులు చేయడం ద్వారా కూడా కడుపు ఉబ్బరానికి చెక్ పెట్టొచ్చు. ఒకేసారి అతిగా తినడం కంటే కొంచెం, కొంచెంగా ఎక్కువసార్లు తింటే మేలని చేస్తుందట. నమిలేటప్పుడు గాలిని మింగేయకుండా నోటిని మూయాలి. నిద్రకు ముందు ఎక్కువగా తినొద్దని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.