హైదరాబాద్ అబ్బాయితో తమన్నా పెళ్లి అంటూ వార్తలు వైరల్.. నిజమేనా..?

హైదరాబాద్ అబ్బాయితో తమన్నా పెళ్లి అంటూ వార్తలు వైరల్.. నిజమేనా..?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా రెండేళ్లుగా హిందీ యాక్టర్ విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరిద్దరి పెళ్ళికి ఇంట్లోవాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వచ్చేఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. 

అయితే తమన్నా, విజయ్ పెళ్లి హైదరాబాద్ లోని ఓ ప్రముఖ రిసార్ట్ లో గ్రాండ్ గా జరగనుందని పలువార్తలు నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి.  విజయ్ వర్మ పుట్టి పెరిగింది హైదరబాద్ లోనే కావడంతో ఆయన కుటుంబ సభ్యులు వీరి పెళ్ళిని హైదరాబాద్ లో చేయాలని నిర్ణయినంచినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కానీ ఈ పెళ్లి వార్తలపై ఇప్పటివరకూ నటి తమన్నా లేదా విజయ్ వర్మ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఈ విషయం ఇలా ఉండగా తమన్నా, విజయ్ వర్మ ప్రముఖ వెబ్ సీరీస్ నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్ నిర్మించిన లస్ట్ స్టోరీస్ 2లో నటించారు. ఈ వెబ్ సీరీస్ లో నటించే సమయంలోనే వీరిద్దరిమధ్య ప్రేమ చిగురించినట్లు సమాచారం. కాగా పలు సందర్భాలలో తమన్నా, విజయ్ వర్మ కలసి తిరుగుతూ మీడియా కంటపడ్డారు.

ఆ మధ్య విజయ్ వర్మ కూడా ఇంటర్వ్యూలలో వీరిద్దరి రిలేషన్ గురించి ఓపెన్ అయ్యాడు. దీంతో అప్పటినుంచి తమన్నా పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకూ అఫిషియల్ అనౌన్స్మెంట్  మాత్రం రాలేదు.